అవి గాసిప్స్.. నిజం కాదు: హరీష్ శంకర్

అవి గాసిప్స్.. నిజం కాదు: హరీష్ శంకర్
పవన్-హరీష్ కాంబోలో మూవీ నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ని రివీల్ చేస్తూ..

గబ్బర్ సింగ్ తో సంచలనం విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో మరో సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. కరోనా రాకపోయుంటే ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది. మైత్రీ మూవీస్ సంస్థలో ప్రతిష్టాత్మకంగా సోషల్ మెస్సేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

పవన్-హరీష్ కాంబోలో మూవీ నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ని రివీల్ చేస్తూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్టర్ హల్ చల్ చేస్తోంది. ఆ పోస్టర్ కి ఫ్యాన్స్ నుంచి కూడా పాజిటివ్ బజ్ వచ్చింది. అయితే అది ఫ్యాన్ మేడ్ పోస్టర్. దీంతో దర్శకుడు హరీష్ శంకర్... ఆ పోస్టర్ అఫిషియల్ కాదని చెప్పడంతో పాటు... కరోనా వల్ల ఈ సినిమా లేట్ అయ్యిందని... త్వరలోనే టైటిల్ ని ప్రకటిస్తామని. అలాగే సినిమాలో పవన్ క్యారెక్టర్ గురించి వస్తున్న వార్తలు కూడా నిజం కాదని...అలా వస్తున్న వాటిని నమ్మొద్దని ప్రకటించాడు. ఈ ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story