Srinu Vaitla: దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో విషాదం..

X
Srinu Vaitla (tv5news.in)
Srinu Vaitla: దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కృష్ణారావు వైట్ల ఈరోజు ఉదయం కన్నుమూశారు. తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీనువైట్లది ఈస్ట్ గోదావరి జిల్లా కండులపాలెం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు.. ఆయన స్వగ్రామంలోనే మరణించారు.
83 సంవత్సరాల కృష్ణారావు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారని కుటుంబ సభ్యులు అంటున్నారు. శ్రీను వైట్ల తండ్రి మరణానికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది శ్రీను వైట్ల అభిమానులు స్పందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
