Pawan Kalyan : పవన్‌ను కాదని వేరే హీరోలతో సినిమాలు.. కారణం అదే..

Pawan Kalyan : పవన్‌ను కాదని వేరే హీరోలతో సినిమాలు.. కారణం అదే..
Pawan Kalyan : పవన్‌ను కాదని వేరే హీరోలతో సినిమా చేయడానికి దర్శకులు రెడీ అవుతున్నారు.

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అటు రాజకీయ నాయకుడిగా ఇటు టాలీవుడ్ యాక్టర్‌గా వ్యవరిస్తున్నారు. ఒకే సారి రెండు పనులను చేయడం కష్టమే. రాజకీయాలు పవన్‌ను ఎంత ముఖ్యమో.. కుటుంబ పోషనకు పార్టీ నడవడానికి సినిమా కూడా అంతే ముఖ్యం. అయితే పార్టీ పనుల్లో బిజీ ఉండడం వల్ల గత రెండేళ్లుగా పవన్‌ షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్, క్రిష్ డైరక్షన్‌లో హరిహర వీరమల్లు సినిమాలు ఇప్పుడు హోల్డ్‌లో ఉన్నాయి.

పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా సురేందర్ రెడ్డి, సంపత్ నందీ లాంటి డైరెక్టర్లు వేరే హీరోలతో కమిట్ అవుతున్నారు. హరీష్ శంకర్ రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నా.. అతన్ని కాదని తమిళ దర్శకుడు సముద్రఖనితో కలిసి వినోదయ సిత్తంను రీమేక్ చేయనున్నారు. పవన్‌ డేట్స్ కోసం తెలుగు డైరెక్టర్లు అడిగితే బిజీ అంటున్నాడని తెలుస్తోంది. ఇటు పవన్ వైఖరిపై అభిమానులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story