అప్పుడు కృష్ణవంశీ.. ఇప్పుడు బోయపాటి..!

అప్పుడు కృష్ణవంశీ.. ఇప్పుడు బోయపాటి..!
ఏ నటుడైనా సరే ఒకేరకమైన పాత్రలకి పరిమితం అవ్వాలని అనుకోడు.. అన్నీ రకాల పాత్రలను పోషించాలని అనుకుంటాడు.

ఏ నటుడైనా సరే ఒకేరకమైన పాత్రలకి పరిమితం అవ్వాలని అనుకోడు.. అన్నీ రకాల పాత్రలను పోషించాలని అనుకుంటాడు.. అప్పుడే ప్రేక్షకుల చేత పరిపూర్ణమైన నటుడని అనిపించుకుంటారు. అయితే అలాంటి నటుడికి సరైన దర్శకుడు దొరకాలి.. అప్పుడే ఆ నటుడిలోని పరిపూర్ణమైన నటుడు బయటకు రాగలడు. అలా హీరో శ్రీకాంత్‌‌ని విభిన్నమైన పాత్రల్లో చూపించి సక్సెస్ అయిన దర్శకులు కొందరే ఉన్నారు. అందులో ఓ ఇద్దరు దర్శకులు కృష్ణవంశీ, బోయపాటి శ్రీను.

కృష్ణవంశీ ఖడ్గం సినిమాకి ముందు శ్రీకాంత్‌‌కి ఫ్యామిలీ హీరో అనే ముద్ర ఉండేది. శ్రీకాంత్ కూడా ఒకేరకమైన పాత్రలు చేయడంతో ఆ తరహ కథలే ఎక్కువగా వచ్చేవి.. కానీ శ్రీకాంత్‌‌ని సీరియస్ నెస్ ఉన్న ఓ పవర్ఫుల్ పాత్రలో చూపించాలని అనుకున్నాడు కృష్ణవంశీ.. అదే ఖడ్గం సినిమాలోని రాధాకృష్ణ రోల్.. ఈ పాత్ర శ్రీకాంత్‌‌తో చేయాలనీ కృష్ణవంశీ పట్టుబడితే అవసరమైతే మరో కోటి రూపాయల బడ్జెట్ పెడతా ఇంకో స్టార్ హీరోని పెట్టుకుందామని ఆ సినిమా నిర్మాత సుంకర మధు మురళి అన్నారట.

అవసరమైతే ప్రొడ్యూసర్‌‌‌ని మారుస్తాను కానీ శ్రీకాంత్‌‌ని మార్చానని తెగేసి చెప్పారట కృష్ణవంశీ.. సినిమా రిలీజ్ అయ్యాక ఖడ్గం సినిమాకి, శ్రీకాంత్‌‌‌కి ఎంతమంచి పేరొచ్చిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత శ్రీకాంత్ మళ్ళీ అంతటి పవర్ఫుల్ పాత్రలో ఇప్పటివరకు కనిపించలేదు.

మళ్ళీ శ్రీకాంత్ లోని మరోకోణాన్ని బయటపెట్టిది మాస్ డైరెక్టర్ బోయపాటినే.. బాలకృష్ణతో బోయపాటి చేస్తోన్న లేటెస్ట్ మూవీ అఖండ.. ఈ సినిమాలో బాలయ్యని ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. బాలయ్యకి శ్రీకాంత్ విలన్ ఏంటని ముందుగా అందరు షాక్ అయ్యారు. బోయపాటిది మరి ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారంతా.. కానీ నిన్న రిలీజైన ట్రైలర్ చూశాక ముక్కున వేలేసుకున్నారు. చూస్తున్నది శ్రీకాంత్ నేనా అని షాక్ అయ్యారు.

మొత్తం శ్రీకాంత్ లుక్ మార్చేశారు బోయపాటి.. 'నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే' అంటూ శ్రీకాంత్ కూడా తనలోని విలన్‌‌‌‌ని బయటపెట్టారు. ఇప్పుడు అందరూ శ్రీకాంత్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. జగపతిబాబు లాగే శ్రీకాంత్ రేంజ్ పెరుగుతుందని టాలీవుడ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story