Tollywood: మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు..సెలబ్రెటీలకు ఈడీ సమన్లు

Tollywood Drugs Case: టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది సెలబ్రెటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. హీరోహీరోయిన్లతోపాటు, పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
2017 సంవత్సరంలో ఈ కేసుతో సంబంధం వున్న 16 మందికి చెందిన గోర్లు, తల వెంట్రుకలను తీసుకోని FSL రిపోర్టుకు పంపించారు. అనంతరం ఈ కేసు విచారణలో వేగం తగ్గింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఫిటిషన్ దాఖలు అయింది. ఫోరమ్ ఫర్ గుడ్ గవెర్నెన్స్ కూడా అటు సిబిఐ అధికారులకు ఈడీ అధికారులకు ఒక లేఖను రాశారు.
ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న నటీనటులు విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఓ దర్శకుడిని ఆగస్ట్ 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరితోపాటు ప్రముఖ హీరో డ్రైవర్ మరికొందరికి కూడా నోటీసులు పంపింది.సెప్టెంబర్ 6న నుంచి నవంబర్ 15న ఒక్కొక్కరిగా హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. వీరంతా సెప్టెంబర్ 2 నుంచి 22 వరకు హాజరు కావాలని ఈడీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com