వికలాంగుల పాత్రలో మెప్పించిన స్టార్స్ వీరే..!

వికలాంగుల పాత్రలో మెప్పించిన స్టార్స్ వీరే..!
Tollywood: ఒక‌ప్పుడు చిన్నా,పెద్ద హీరోలు ఎవ‌రైన స‌రే త‌మ సినిమాలో ఫైట్స్, ఆరు పాటలు, నాలుగు డైలాగ్స్ అనే ధోర‌ణిలో సినిమాలు చేసేవారు.

దక్షిణాది హీరోలు త‌మ పంథాను మారుస్తున్నారు. ఒక‌ప్పుడు చిన్నా, పెద్ద హీరోలు ఎవ‌రైన స‌రే త‌మ సినిమాలో ఫైట్స్, ఆరు పాటలు, నాలుగు డైలాగ్స్ అనే ధోర‌ణిలో సినిమాలు చేసేవారు. మ‌రి కొంద‌రూ హీరోలు అయితే ఐట‌మ్ సాంగ్స్ క‌చ్చితంగా కావాల‌ని ప‌ట్టుప‌ట్టేవారు. వారు కోరుకున్న విధంగా క‌థ‌లు రెడీ చేస్తే అస‌లు థీమ్ పోతుంది. దీంతో సినిమా రిలీజ్ త‌ర్వాత‌ బాక్సాఫిసు ముందు ఫ‌లితం మరోలా ఉంటుంది. ఎప్పుడూ మూస‌ధోర‌ణీలోనే కాకుండా విభిన్నక‌థ‌లు ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నారు.

గ‌త కొన్నేళ్లుగా సినిమాల‌ ఎంపిక ద‌గ్గర నుంచి పాత్ర ఎంపిక‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా స‌రే చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. వికలాంగుల పాత్రలు చేస్తూ విజయాన్ని అందుకుటున్నారు. బాలీవుడ్, కోలివుడ్ స్టార్స్ కాకుండా తెలుగు హీరోలు కూడా ఈ విధ‌మైన పాత్రలు చేయ‌డం చెప్పుకొద‌గ్గ ప‌రిణామం. ఇప్పటి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో ఏ హీరో ఎలాంటి పాత్రలు చేశారో తెలుసుకుందాం.


మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముందు వ‌రుస‌లో ఉంటారు. రామ్ చ‌ర‌ణ్ చెవిటి వాడిగా రంగ‌స్థలం సినిమాలో న‌టించాడు. సుకుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో చెర్రీ సౌండ్ ఇంజ‌నీర్ పాత్రలో అద‌ర‌గొట్టాడు. ప్రస్తుతం చెర్రీ ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు, ఆచార్య, శంక‌ర్ ద‌ర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు.


మాస్ మ‌హారాజ్ ర‌వితేజ కూడా రాజా దిగ్రేట్ సినిమాలో అంధుడిగా అద్భుత న‌ట‌న క‌న‌బ‌రిచారు. అంతేకాదు ఈ సినిమాలో పుట్టు గ‌డ్డిగా వాడిగా న‌టించాడు. ఈ మూవీలో ర‌వితేజ చెప్పే డైలాగ్స్ ఓరేంజ్ లో పేలాయి. అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ మూవీ సూప‌ర్ హిట్ గా నిలిచింది.


కింగ్ నాగార్జున ఉపిరి మూవీ నటించాడు


ఆది పినిశెట్టి కూడా నువేవ్వరో సినిమాలో అంధుడిగా నటించి మెప్పించాడు


ఇక రాజ్ త‌రుణ్ అంద‌గాడు సినిమాలో అద్భుతంగా న‌టించాడు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కాక‌పోయిన‌ప్ప‌టికీ రాజ్ త‌రుణ్ పాత్ర అందిరికి మెప్పించింది.


గేమ్ ఓవర్ మూవీలో తాప్సీ కూడా వికలాంగురాలిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. త‌మిళ హీరో, ఎమ్మెల్యే ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా ఓ సినిమాలో అంధుడిగా న‌టించాడు. సైకో అనే థ్రిల్లర్ మూవీలో స్టాలిన్ ఈ పాత్ర చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story