Prabhas : డ్రగ్స్ పై టాలీవుడ్ ను ఫుల్లుగా వాడేస్తోన్న రేవంత్ రెడ్డి

కొన్నాళ్ల క్రితం తెలంగాణలో డ్రగ్స్ అనగానే టాలీవుడ్ పేరు అనివార్యంగా వినిపించింది. కొన్నిసార్లు అక్రమంగా టాలీవుడ్ లోని కొందరు ప్రముఖుల పేర్లను కూడా చేర్చారు. చాలా వరకూ వీరికి క్లీన్ చిట్ వచ్చేసింది. అయితే తెలంగాణ గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారిందని గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ అదే పనిగా విమర్శించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు అంశాలపై బాగా దృష్టి పెట్టింది. ఇందుకోసం టాలీవుడ్ సహాయం తీసుకుంది ఇక్కడి ప్రభుత్వం. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ బిగ్గీస్ మీట్ అయిన సందర్భంగా సిఎమ్ చేసిన సూచనలను ఇమ్మీడియొట్ గా అప్లై చేస్తోంది టాలీవుడ్. ‘సే నో డ్రగ్స్’ అనే పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా చాలామంది సెలబ్రిటీస్ తో డ్రగ్స్ తో పాటు ఇతర మోసాలకు సంబంధించిన అంశాలపై అవేర్ నెస్ కల్పిస్తూ వీడియోస్ చేస్తున్నారు. అడివి శేష్, శ్రీ లీల, ప్రభాస్ లాంటి వారు ఆల్రెడీ తమ వీడియోస్ ను పంపించారు. ఇంకా చాలామంది ఈ తరహా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కు ప్రజలకు పిలుపునిస్తున్నారు. మొత్తంగా మీటింగ్ అద్భుతంగా జరిగిందని టాలీవుడ్ పెద్దలు అన్నారు. అందులో భాగంగా ఇదీ ఒకటిగా అనుకోవాలి.
ఇకపై ప్రతి సినిమాలోనూ మద్యం, సిగరెట్ వద్దు అనే తరహా వాటితో పాటు డ్రగ్స్ కూడా వాడొద్దు అంటూ ఓ వీడియో బైట్ కనిపించబోతోంది. అలాగే సోషల్ మీడియా ఫ్రాడ్స్, డిజిటల్ మోసాలపైనా అవేర్ నెస్ కల్పించేందుకు ‘ఫ్రీ’గా టాలీవుడ్ సాయం తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అఫ్ కోర్స్ ఇందుకు వారు తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకుంటారు. బెన్ ఫిట్ షోస్ పొందుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com