Balakrishna : ఆస్పత్రిలో చేరిన బాలయ్య... సర్జరీ చేసిన వైద్యులు..!

Balakrishna : ఆస్పత్రిలో చేరిన బాలయ్య... సర్జరీ చేసిన వైద్యులు..!
Balakrishna : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు.. గత ఆరు నెలలుగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు.

Balakrishna : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు.. గత ఆరు నెలలుగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత నెల( అక్టోబర్ 31న ) చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు నాలుగు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆయనకీ ఆరు నెలల విశ్రాంతి తప్పనిసరి అని వైద్యులు తెలిపారు.

కాగా ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' అనే సినిమాలో నటిస్తున్నారు బాలయ్య. దీనికి సంబంధించిన షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అటు ఆహాలో 'అన్‌స్టాపబుల్స్‌' పేరుతో ఓ షోని చేస్తున్నారు బాలయ్య.. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలిజైంది. ఇందులో బాలయ్య సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story