Balakrishna : గీతా ఆర్ట్స్‌‌లో బాలయ్య... దర్శకుడు ఎవరంటే..?

Balakrishna : గీతా ఆర్ట్స్‌‌లో బాలయ్య... దర్శకుడు ఎవరంటే..?
Balakrishna : తెలుగు ఇండస్ట్రీలో వన్ అఫ్ ది టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ .. 40 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ బ్యానర్ నుంచి ఇప్పటికి ఎన్నో హిట్స్ సినిమాలు వచ్చాయి.

Balakrishna : తెలుగు ఇండస్ట్రీలో వన్ అఫ్ ది టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ .. 40 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ బ్యానర్ నుంచి ఇప్పటికి ఎన్నో హిట్స్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ బ్యానర్‌‌లో మొదటిసారిగా నటించేందుకు రెడీ అవుతున్నారట నందమూరి నటసింహం బాలకృష్ణ. ఓ పవర్ఫుల్ కథని బాలయ్య కోసం లాక్ చేశారట నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా కోసం ఓ క్రేజీ డైరెక్టర్‌‌ని కూడా ఫిక్స్ చేశారట అరవింద్.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న బింబిసార అనే మూవీని డైరెక్ట్ చేస్తోన్న మల్లిడి వశిష్ట్.. బాలయ్య, అరవింద్ కాంబో మూవీకి దర్శకత్వం వహించనున్నాడట. అందుకు గాను వశిష్ట్‌‌కి.. అరవింద్ అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. అవినీతి రహిత సమాజం కోసం పోరాడే ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఇది అని సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ త్వరలోనే రానుంది.

#NBK109 పేరుతో ట్విట్టర్ లో ఓ హాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. కాగా అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో బాలకృష్ణ హోస్ట్‌‌గా అన్‌స్టాప‌బుల్‌ అనే షోని చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story