Mahesh Babu : మరో చిన్నారికి ఊపిరి పోసిన మహేష్..!

Mahesh Babu : మరో చిన్నారికి ఊపిరి పోసిన మహేష్..!
X
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాలతోనే స్టార్ స్టేటస్‌‌‌ని చూడలేదు.. సినిమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ఆయన్ని రియల్ హీరోని చేశాయి.

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాలతోనే స్టార్ స్టేటస్‌‌‌ని చూడలేదు.. సినిమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా ఆయన్ని రియల్ హీరోని చేశాయి. మహేష్ బాబు ప్రారంభించిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా వేయికి మందికి పైగా చిన్నారులకి గుండె ఆపరేషన్‌‌‌లు చేయించారు మహేష్.

తాజాగా మరో చిన్నారికి ఊపిరి పోశారు ఈ సూపర్ స్టార్.. జి మాన్వి అనే సంవత్సరం పాపకి ఇటీవల గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి సురక్షితంగా ఉంది. ఈ విషయాన్ని మహేష్ బాబ ఫౌండేషన్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది. మాన్వికి చికిత్సని అందించిన ఆంధ్రా హాస్పిటల్స్ బృందానికి మహేష్ బాబు ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపింది.

కాగా ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీ షూటింగ్‌‌లో బిజీగా ఉన్నాడు.. కీర్తి సురేష్ హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ మూవీ మే 12న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీని చేయనున్నాడు మహేష్.



Tags

Next Story