సినిమా

Manchu Manoj: వర్మకి మంచు మనోజ్ రిటర్న్ గిప్ట్.. తగ్గేదేలే..

Manchu Manoj: వర్మకు ఇచ్చిన పంచ్ అదిరింది బాస్ అని కామెంట్లు పెడుతున్నారు.

Manchu Manoj: వర్మకి మంచు మనోజ్ రిటర్న్ గిప్ట్.. తగ్గేదేలే..
X

Manchu Manoj: ఏం వర్మగారు ఎలా కనిపిస్తున్నారు మంచు ఫ్యామిలీ.. మా అధ్యక్షుడిగా ఎన్నికైన మా అన్నయ్య మంచు విష్ణుని విష్ చేయాల్సింది పోయి అసోసియేషన్ సభ్యులంతా సర్కస్‌లో జోకర్లని కామెంట్ చేస్తారా అని వర్మకి తగ్గేదేలే అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంచు మనోజ్. మా సభ్యులు జోకర్లైతే.. మీరు రింగ్ మాస్టరా అంటూ రిటర్న్ గిప్ట్ ఇచ్చేశాడు.

ఇక మనోజ్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. వర్మకు ఇచ్చిన పంచ్ అదిరింది బాస్ అని కామెంట్లు పెడుతున్నారు.

టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. సినీతారలైనా, పొలిటికల్ లీడర్స్ అయినా ఎవర్నీ వదిలేదంటూ కామెంట్ చేస్తుంటారు. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మా ఎన్నికలు, మా అధ్యక్షుడు కామెంట్ చేసేందుకు ఆయనకు ఆయుధాలయ్యాయి. అనడం, అనిపించుకోవడం వర్మకు మామూలే. అందులో కొత్తేముంది అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Next Story

RELATED STORIES