Nithiin: భార్యకి ప్రేమతో.. కరోనాకే అడ్డంకులు.. ప్రేమకి కాదు కదా..!

Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య శాలిని కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే నేడు అమె పుట్టినరోజు కావడంతో బర్త్‌డే వేడుకలను కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేశాడు నితిన్.. ఇంట్లో పైన ఒక రూమ్‌లో ఉంటున్న శాలిని కిటికి లోంచి చూస్తూ ఉండగా.. కింద గార్డెన్ ఏరియాలో నితిన్ తన కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేశాడు.
ఇలా దూరం దూరంగా ఉండి నితిన్ తన వైఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోని నితిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "కోవిడ్ కి సరిహద్దులు ఉన్నాయేమో, మన ప్రేమకి సరిహద్దులు లేవు, హ్యాపీ బర్త్ డే టు మై లవ్. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ గా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు..ఇది చూసిన నెటిజన్లు నితిన్ కి భార్య అంటే ఎంత ప్రేమో అని కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా బర్త్ డే విషెస్ కూడా చెబుతున్నారు.
COVID has barriers…
— nithiin (@actor_nithiin) January 6, 2022
But LOVE has no BARRIERS..
HAPPY BIRTHDAY MY LOVE❤️
LIFE lo 1st time nuvvu negative kavalani korukuntunnanu 😘😘 pic.twitter.com/5zFuOOIaqe
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com