NTR : ఎన్టీఆర్ కు 200 కోట్ల నష్టం?...ఎందుకంటే..!

NTR : ఎన్టీఆర్ కు 200 కోట్ల నష్టం?...ఎందుకంటే..!
NTR : తారక్ విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ సినిమా తప్ప చేతిలో మరో సినిమా లేదు. ఇది ప్రస్తుతానికి పాన్ ఇండియా మూవీ అయితే కాదు. దానిని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి.

NTR : బాహుబలి సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న మూవీ RRR. ఎన్టీఆర్, రామ్‌‌‌‌చరణ్ లు కలిసి నటిస్తోన్న ఈ సినిమా రిలీజ్‌‌కి దగ్గరపడి పలుమార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా పడింది. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్‌‌‌‌చరణ్ లు ఏకంగా రెండు సంవత్సరాలు డేట్స్ కేటాయించారు. కానీ కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ మరో రెండు సంవత్సరాలు దాటింది. దీనితో మొత్తం ఈ సినిమాకి నాలుగు సంవత్సరాలు పట్టింది.

అయితే ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే ఆచార్య సినిమాలో ఓ కీ రోల్ కి పచ్చజెండా ఊపేశారు చరణ్.. ఆ తర్వాత శంకర్ మూవీని లైన్ లో పెట్టారు. ఆ తర్వాత జెర్సీ మూవీ ఫేం గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా కన్ఫర్మ్ చేశారు. ఆచార్య తప్ప మిగిలిన ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. ఇందులో శంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళగా, ఆచార్య ఫినిష్ అయింది.

ఇక తారక్ విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ సినిమా తప్ప చేతిలో మరో సినిమా లేదు. ఇది ప్రస్తుతానికి పాన్ ఇండియా మూవీ అయితే కాదు. దానిని ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. కానీ అది పాన్ ఇండియా మూవీ అవుతుందో లేదో చూడాలి. RRR సినిమా కోసం ఎన్టీఆర్ రూ. 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని భోగట్టా.. ఒకవేళ RRR సినిమా చేయకుండా ఈ టైమ్ లో ఆరు సినిమాలు చేసినా 200 కోట్ల పారితోషికం వచ్చి వుండేదని, ఆ ఆరు సినిమాల్లో ఏ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ ఉండేదని ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.

ఏ పాన్ ఇండియా ఇమేజ్ లేకుండానే స్టార్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు యాభై కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటున్నరని ఎన్టీఆర్ అదే రూట్ లో వెళ్లుంటే ఇంత రెమ్యునరేషన్ తీసుకునేవాడని ఫిలింనగర్ భోగట్టా.

Tags

Read MoreRead Less
Next Story