RRR : జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్..!

RRR : కేవలం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు మెుత్తం ఇండియన్ సినిమా ఎదురుచూస్తోన్న చిత్రం RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అనేక సర్‌ప్రైజ్‌లు ఉన్నాయట.. సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు రాజమౌళి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోన్నాడట. ఇప్పటికే సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అవ్వగా మూడో పాటను నవంబర్ 26న రిలీజ్ చేయనున్నారు.
ఇదిలావుండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ స్వయంగా ఓ పాట పాడాడట. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, ఎన్టీఆర్ చేత ఒక పాట పాడించారన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇదే నిజమైతే సినిమాకి మరింత బజ్ ఏర్పడినట్టే.. అటు ఎన్టీఆర్‌కు సింగర్‌గా మంచి ట్రాకే ఉంది. యమదొంగ, కంత్రీ, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో లాంటి చిత్రాల్లో పాటలు పాడారు ఎన్టీఆర్. ఈ పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.
ఇప్పుడు RRR సినిమాతో చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్. మళ్లీ సింగర్‌గా మారబోతున్నాడన్న మాట. ఇక RRR చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com