Ram charan Tej : ఖాసా సరిహద్దుల్లో చరణ్.. వారితో కలిసి భోజనం..!

Ram charan Tej : గ్రేట్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఇంకా టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా చరణ్‌కి 15 వ చిత్రం కాగా, దిల్ రాజుకి 50వ చిత్రం కావడం విశేషం.
ప్రస్తుతం పంజాబ్ లోని అమృత్‌సర్‌లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అక్కడే కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిసున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ మూవీలో చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అక్కడ షూటింగ్ కి కాస్త విరామం దొరకడంతో చరణ్.
ఆ సమయాన్ని బీఎస్‌ఎఫ్ జవాన్లతో గడిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చరణ్.. ''ఖాసా అమృత్‌సర్‌లోని సరిహద్దు భద్రతా దళం క్యాంప్‌లో సైనికుల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నం గడిపా'' అంటూ జవాన్లతో కలిసి దిగిన కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు.
అక్కడ జవాన్లతో ముచ్చటించడమే కాకుండా వారితో కలిసి భోజనం కూడా చేశారు చెర్రీ.. కాగా ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్... ఈ నెల చివర్లో తన తండ్రి ఆచార్య సినిమాతో మరోసారి థియేటర్లో సందడి చేయనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com