Maa Elections 2021 Results: ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహన్‌పై శ్రీకాంత్ గెలుపు

srikanth babu mohan (tv5news.in)
Maa Elections 2021 Results : మా ఎన్నికల్లో విజయం అభ్యర్థులతో చివరి వరకు దోబూచులాడింది. ఒక్కొక్క ఓటు లెక్కపెడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగింది. చివరకు అంతటి ఉత్కంఠ మధ్య.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా హీరో శ్రీకాంత్ విజయం సాధించారు. ఆయన ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేశారు.
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా హీరో మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబూమోహన్ పోటీ చేశారు. చివరి వరకు పోటాపోటీగా నిలిచినా.. ఉత్కంఠభరితమైన పోరులో మొత్తానికి హీరో శ్రీకాంత్ పై ఓటమి తప్పలేదు. ప్రచారం విషయంలో రెండు ప్యానళ్లు అస్సలు వెనక్కు తగ్గలేదు. దీంతో ఏ పోస్టు ఏ ప్యానల్ కి దక్కుతుందా అని టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూసింది.
ఇప్పుడు ప్రధానమైన పోస్టులన్నీ రెండు ప్యానళ్లలో ఒక్కొక్కరికీ దక్కడంతో రాబోయే రెండేళ్లు పరిపాలన ఎలా సాగుతుందా అన్న ఆసక్తి పెరిగింది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే విషయంలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్యా బేధాభిప్రాయాలు వస్తే.. అవి అమల్లోకి రావడం కష్టమవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com