Sumanth : దురదృష్టవశాత్తూ విడాకులు ఇప్పుడు కామన్ అయిపోయాయి : సుమంత్

Sumanth : దురదృష్టవశాత్తూ విడాకులు ఇప్పుడు కామన్ అయిపోయాయి : సుమంత్
Sumanth :విడాకులు తీసుకోవడం దురదృష్టవశాత్తూ ఇప్పుడు కామన్ అయిపోయిందని అంటున్నాడు హీరో సుమంత్.

Sumanth :విడాకులు తీసుకోవడం దురదృష్టవశాత్తూ ఇప్పుడు కామన్ అయిపోయిందని అంటున్నాడు హీరో సుమంత్. ప్రస్తుతం మళ్లీ మొదలైంది అనే సినిమాని కంప్లీట్ చేశాడు సుమంత్. డివోర్స్ కాన్సెప్ట్‌‌తో తెరకెక్కింది ఈ మూవీ. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా విడాకుల పైన సుమంత్ స్పందిచాల్సి వచ్చింది.

గతంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుమంత్.. ఆ తరవాత ఇద్దరు విడిపోయారు. కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకుంది కానీ సుమంత్ మాత్రం మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ.. తనకి తెలిసి చాలా మంది విడాకులు తీసుకున్నారని, తన కుటుంబంలో కూడా విడాకులున్నాయని అన్నాడు. దురదృష్టవశాత్తూ డైవోర్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయంలో తాను దురదృష్టం అనే పదం కూడా వాడదలుచుకోలేదని అన్నాడు. అలా జరుగుతున్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ అడ్జెస్ట్ అయిపోతున్నారని, ఎందుకంటే, రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ముద్ర పడిపోతుందని చెప్పుకొచ్చాడు.. అందుకే రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలనే అనుకుంటారని తెలిపాడు సుమంత్..

నైనా గంగూలీ హీరోయిన్‌‌గా నటించిన మళ్ళీ మొదలైంది చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.

Tags

Read MoreRead Less
Next Story