కోటీ మందితో కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ!

కోటీ మందితో కొత్త రికార్డు క్రియేట్  చేసిన విజయ్ దేవరకొండ!
కేవలం సినిమాలు ఒక్కటే కాదు డిఫరెంట్ అటిట్యూడ్, స్టైల్, హెల్పింగ్ నేచర్ విజయ్ ని ఫ్యాన్స్ కి దగ్గర చేశాయి. ఇక ఇదిలా ఉంటే విజయ్ ఇప్పుడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

పెళ్లి చూపులు సినిమాతో వెండితెరకి పరిచయమై అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ.. ఈ సినిమాతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్ మొత్తం విజయ్ ని ఫాలో అయిపోయారు. ఇప్పుడు విజయ్ నుంచి సినిమా వస్తుందంటే అంటే ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు అన్నీ ఇండస్ట్రీల ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసినప్పటికీ అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ ని చూశారంటే విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. కేవలం సినిమాలు ఒక్కటే కాదు డిఫరెంట్ అటిట్యూడ్, స్టైల్, హెల్పింగ్ నేచర్ ఇవ్వన్నీ విజయ్ ని ఫ్యాన్స్ కి దగ్గర చేశాయి.

ఇక ఇదిలా ఉంటే విజయ్ ఇప్పుడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఏకంగా కోటీ మంది ఫాలోవర్స్ దక్కించుకొని రికార్డు సృష్టించాడు. సౌత్ లోనే మరే స్టార్ కి కూడా ఇన్‌స్టాగ్రామ్‌ లో కోటీ మంది ఫాలోవర్స్ లేకపోవడం విశేషం. ప్రస్తుతం "1 క్రోర్ ఇన్ స్టా రౌడీస్'' అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే ఈ ఘనత సాధించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక విజయ్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఆకట్టుకున్న విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story