Pooja Hegde : అదే నా కల.. ముంబైలో బుట్టబొమ్మ బిజీబిజీ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న ఈ బుట్టబొమ్మ.. ఇప్పుడు ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలు విడుదలకి సిద్దంగా ఉన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇన్ని సినిమాల బిజీ షెడ్యుల్ మధ్యలో కూడా తన సొంతింటి నిర్మాణం పైన ఫోకస్ పెట్టింది. పూజా హెగ్డే కన్నడ అయినప్పటికీ కుటుంబం మొత్తం ముంబయిలో స్థిరపడడానికి నిర్ణయం తీసుకున్నారు.
అక్కడ తనకోసం, తన కుటుంబం కోసం ఓ ఇల్లును నిర్మించుకుంటోంది పూజా . సొంత ఇల్లు కలిగివుండడం అనేది తన కల అని, ఇప్పుడది నెరవేరుతోందంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు జత చేసింది. ఇందులో పూజా తన ఇంటికి సంబంధించి పెయింటింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. పూజ హెగ్డే సొంతింటి నిర్మాణ పనులను ఆమె తల్లి పర్యవేక్షిస్తోందట. ఈ సందర్భంగా పూజ తన తల్లిని 'సూపర్ మామ్' అంటూ రాసుకొచ్చింది.
Building my dreams ❤️ #home #supermom #mykindalovestory pic.twitter.com/7h4tb0MwZb
— Pooja Hegde (@hegdepooja) October 27, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com