ఈ హీరోయిన్స్ కుమార్తెలు కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్..!

ఈ హీరోయిన్స్ కుమార్తెలు కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్..!

keerthi suresh

Tollywood Actress: డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అయినట్లు.. సినిమా నటుల పిల్లలు నటులు కావడం చాలా సహజం. కానీ హీరోల కొడుకులు మాత్రమే హీరోలుగా రానిస్తుంటారు.

Tollywood Actress: డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అయినట్లు.. సినిమా నటుల పిల్లలు నటులు కావడం చాలా సహజం. కానీ హీరోల కొడుకులు మాత్రమే హీరోలుగా రానిస్తుంటారు. హీరోయిన్ల కూతుర్లు సినిమాల్లోకి వచ్చిన దాఖలాలు తక్కువే. కానీ ఒకప్పటి స్టార్ హీరోయిన్ల కూతుర్లు హీరోయిన్స్ గా వెండి తెరపై మెరిసిన సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఆ స్టార్ హీరోయిన్లెవరు..వారి కూతుర్లెవరో ఓ లుక్కేయండి.

శ్రీదేవి - జాన్వికపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్.. ధడక్ అనే సినిమాతో బాలివుడ్లోకి అడుగుపెట్టింది.. శ్రీదేవి జాన్వి సినిమా కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కానీ తన తొలిసినిమా చూడకుండానే కన్నుమూసింది.


లక్ష్మి - ఐశ్వర్య

ఒకప్పటి అందాల తార లక్ష్మి కూతురే ఐశ్వర్య.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు


రాధ-కార్తిక,తులసి

హీరోయిన్ గా గుర్తింపు పొందిన రాధ కి ఇద్దరు కూతుర్లు..కార్తిక,తులసి..మణిరత్నం వంటి డైరెక్టర్ తో కడలి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది తులసి. నాగచైతన్య డెబ్యూ మూవి జోష్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది కార్తిక..


జీవిత – శివాని,శివాత్మిక


సారిక – శృతిహాసన్, అక్షర హాసన్


మంజుల – వనిత, శ్రీదేవి,ప్రీత


ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజులకి ముగ్గురు కూతుర్లు..వనిత,ప్రీత,శ్రీదేవి.. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో వనిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ప్రీత రుక్మిణితో ఎంట్రి ఇచ్చి ప్రియమైన నీకు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి లాంటి సినిమాల్లో నటించింది.. ప్రభాస్ డెబ్యూ మూవి ఈశ్వర్ తో శ్రీదేవి పరిచయం అయింది.. ప్రస్తుతం ప్రీత,శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉండగా, వనిత మూడో పెళ్లితో వార్తల్లో వ్యక్తిగా మారింది.

మేనక – కీర్తిసురేశ్

చిరంజీవి సరసన పున్నమినాగు చిత్రంలో నటించింది మేనక..ఆమె కూతురే కీర్తి సురేశ్..మహానటి సినిమాతో ఒక్కసారిగా జాతియ స్థాయిలో గుర్తింపు పొందింది.


లిజి- కళ్యాణి ప్రియదర్శన్

ఆత్మబంధం,20వ శతాబ్దం వంటి సినిమాల్లో సుమన్ సరసన మళయాల నటి లిజి . తన కూతురే కళ్యాణి ప్రియదర్శన్.. అఖిల్ డెబ్యూ మూవి హలో సినిమాతో ఎంట్రి ఇచ్చింది.



Tags

Next Story