Tollywood..హీరోలు లోకల్.. డైరెక్టర్‌లు నాన్ లోకల్! మరి.. ఆ సినిమాల భవిష్యత్తు..

Tollywood..హీరోలు లోకల్.. డైరెక్టర్‌లు నాన్ లోకల్!  మరి.. ఆ సినిమాల భవిష్యత్తు..

Tollywood Actors works non Tollywood Directors

ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ దర్శకులు మన Tollywood హీరోల కోసం క్యూ కడుతున్నారు.

'మనిషన్నాకా కాస్తంత కళా పోషణ ఉండాలి' అని రావు గోపాల్ రావు ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు.. మానవ జీవితంలో కళ ఒక భాగమైంది. కళలేని జీవితాన్ని ఊహించలేనంతగా మారింది. మరి కళల్లో అన్నింటికంటే సరికొత్తది చలనచిత్రకళ. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు చిత్ర కళ. ఎన్నో దశాబ్దాలుగా ఎదుగుతూ.. కొత్తకొత్త రూపాలను సంతరించుకుంటూ వస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమ. మన టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలనాలకు మారుపేరు. ఒకప్పుడు తెలుగులో వచ్చిన అనేక కథలు.. ఇతర భాషల్లోనూ తెరకెక్కించటానికి దర్శక నిర్మాతలు పోటీ పడేవారు. ఆవిధంగా టాలీవుడ్ ఖ్యాతి ఇతర చిత్ర పరిశ్రమలకు వ్యాపించింది.

ఇటీవలికాలంలో తెలుగు దర్శకుడు రాజమౌళి సృష్టించిన యాక్షన్‌ అడ్వంచర్‌ 'బాహుబలి' మూవీ టాలీవుడ్‌ ఇండ్రస్ట్రీ ఖ్యాతిని దశదిశలకు వ్యాప్తి చెందేలా చేసింది. అయితే మన దర్శకధీరుడుకి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసే సత్తా.. విజన్ ఉన్నాయి. కానీ అందుకు తగ్గ కటౌట్ కావాలిగా మరి. ఆ కటౌట్ పేరు ప్రభాస్. వీరిద్దరూ కలిసి వెండితెరపై అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు.


దీంతో తెలుగు కథానాయకుల గొప్పతనాన్ని పసిగట్టిన ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ దర్శకులు మన Tollywood హీరోల కోసం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్‌ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌తో ఒక వైపు ఓంరౌత్‌.. మరోవైపు ప్రశాంత్‌నీల్‌ భారీ బడ్జెట్‌తో మూవీలను తెరకెక్కిస్తున్నారు.

'కేజీఎఫ్‌' మూవీతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్‌నీల్‌ ప్రభాస్‌తో కలిసి తెరకెక్కిస్తోన్న చిత్రం 'సలార్‌'. పాన్‌ ఇండియా మూవీగా ఇది రిలీజ్ కానుంది.


బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఆదిపురుష్‌'. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నారు.


Tollywood మెగాస్టార్‌ చిరంజీవిని కోలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేయనున్నారు. అతను మరేవరో కాదు కుటుంబకథా చిత్రాలతో దర్శకుడిగా కోలీవుడ్‌లో మంచి పేరు సంపాదించిన మోహన్‌రాజా. 'లూసిఫర్‌' రీమేక్‌ని చిరుతో ప్లాన్ చేస్తున్నారు మోహన్‌రాజా. 'హనుమాన్‌ జంక్షన్‌' మూవీ తర్వాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న డైరెక్ట్‌ తెలుగు చిత్రం 'లూసిఫర్‌' రీమేక్ కావటం విశేషం.


ఇక ఓ తమిళ టాప్ డైరక్టర్.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ఓ మూవీని తీయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ టాప్ డైరెక్టర్ ఎవరంటే..శంకర్.. ఈయన మూవీ అంటే బడ్జెట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయన ఇప్పుడు చెర్రీతో ఓ భారీ ప్రాజెక్ట్‌ ప్రకటించారు.


ఎనర్జిటిక్ యంగ్ స్టార్ రామ్‌తో ఓ కోలీవుడ్ డైరెక్టర్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. 'పందెం కోడి', 'పందెంకోడి-2' సినిమాలతో తెలుగువారికి దగ్గరైన కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామి. ఆయన ఇప్పుడు మన రామ్‌తో ఓ మూవీని తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు.మరి ఇప్పుడు వేరే డైరెక్టర్ కన్ను మన టాలీవుడ్ మీద పడితే.. మన దర్శకులు ఊరుకుంటారా.. మనవాళ్లు కూడా Tollywood సినీ పరిశ్రమే కాకుండా ఇతర చిత్ర పరిశ్రమలపై గురిపెడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మన దర్శకులు పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 'కబీర్‌సింగ్‌' మూవీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. అదే బాటలో 'జెర్సీ' దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి కూడా బాలీవుడ్‌పై కన్నేశారు.

Tags

Next Story