Balakrishna : బాలయ్య కొడుకును పట్టించుకోని టాలీవుడ్

Balakrishna :   బాలయ్య కొడుకును పట్టించుకోని టాలీవుడ్

టాప్ హీరోల నుంచి వారసత్వ హీరోలు వస్తున్నారంటే టాలీవుడ్ లో ఒక హంగామా కనిపిస్తుంది. వారికి శుభాకాంక్షలు చెబుతుంటారు. ఆల్ ది బెస్ట్ అంటూ అభినందనలు తెలియజేస్తుంటారు. అలాంటిది నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయబోతోన్న వేళ తన బర్త్ డే సందర్భంగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కనీసం అతనికి బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు టాలీవుడ్ నుంచి.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే అతనికి మంచి కెరీర్ ఉండాలని కాంక్షిస్తూ.. బర్త్ డే విషెస్ చెప్పారు. అంతే ఇండస్ట్రీ నుంచి ఇంకెవరూ పట్టించుకోలేదు. మోక్షు ఏమీ చిన్న, మీడియం రేంజ్ హీరో తనయుడు కాదు.. ఇండస్ట్రీకి మూల స్థంభంగా నిలిచిన ఎన్టీఆర్ మనవడు. బాలకృష్ణ ఇప్పటికీ టాప్ స్టార్ గానే ఉన్నాడు. అటు వారి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో ఉంటే కళ్యాణ్ రామ్ టైర్ టూలో సత్తా చాటుతున్నాడు. ఇంత లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు అంటే కనీసం విషెస్ కూడా చెప్పలేదెవరూ.


అంటే మోక్షజ్ఞ సాధారణ జనానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో చాలామందికి తెలిసే ఉంటాడు కదా. పైగా రెగ్యులర్ తన తండ్రి షూటింగ్స్ చూడ్డానికి వెళుతుంటాడు. ఆ సందర్భంగా చాలామంది స్టార్స్ తోనూ పరిచయాలు ఏర్పడతాయి. అలా చూసినా కూడా మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ కానీ.. అరంగేట్రం సందర్భంగా ఆల్ ద బెస్ట్ లు కూడా రాలేదు అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. మరి హీరోగా నటించే సినిమా ఓపెనింగ్ రోజున బెస్ట్ విషెస్ చెబుతారేమో కానీ.. ఇవాళ్టి సందర్భం నందమూరి అభిమానుల్ని కాస్త డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి.

Tags

Next Story