సినిమా

RRR Release Date: 2022 సమ్మర్‌లో 'ఆర్ఆర్ఆర్'.. వాయిదా పక్కా..!

RRR Release Date: రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

RRR Release Date (tv5news.in)
X

RRR Release Date (tv5news.in)

RRR Release Date: రాజమౌళి దర్శకత్వంలో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాను బాహుబలిని మించిన హిట్ చేయాలని రాజమౌళి బలంగా కోరుకుంటున్నాడు. అందుకే ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా విడుదల గురించి మరోసారి కన్ఫ్యూజన్ ఏర్పడింది.

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభమయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు పైనే అవుతుంది. ప్రతీదాంట్లో పర్ఫెక్షన్ కోరుకునే రాజమౌళి.. ఈ సినిమాలో ప్రతీ షాట్‌ను, ప్రతీ సీన్‌ను జాగ్రత్తగా తెరకెక్కించి దీనికి ఒక ఫైనల్ ఔట్‌పుట్‌ను తీసుకురావడానికి ఇంత సమయం పట్టింది. అందుకే ఈ సినిమా విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభమయిన తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చింది. అందుకే ముందు అనుకున్న తేదీలో సినిమా విడుదల కాదు కదా.. కనీసం షూటింగ్ కూడా సగం వరకు పూర్తి కాలేకపోయింది. దాదాపు ఆరు నెలల మూవీ సెట్స్‌‌పైకి వెళ్లే అవకాశం రాలేదు. సెకండ్ వేవ్ వల్ల కూడా ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్లు ఆగిపోయింది. అప్పటికే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ మూడు సార్లు వాయిదా పడింది.

ఫైనల్‌గా 2022 జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దానికి తగినట్టుగానే ప్రమోషన్స్ కూడా మొదలయిపోయాయి. కానీ ఇంతలోనే ఒమిక్రాన్ వల్ల నార్త్ స్టేట్స్‌లో నైట్ కర్ఫ్యూ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పలు రాష్ట్రాల్లో థియేటర్లకు కూడా తాళం వేశారు. దీంతో ఆర్ఆర్ఆర్ మరోసారి 2022 సమ్మర్‌కు వాయిదా పడినట్టు టాక్ నడుస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ ఇంక వాయిదా అవ్వదు అని మాటిచ్చిన రాజమౌళి.. ఈ టాక్ గురించి ఎలా స్పందిస్తాడో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES