Tollywood : లారెన్స్ స్ట్రైట్ తెలుగు సినిమాకి డైరెక్టర్ ఇతడేనా?

Tollywood : లారెన్స్ స్ట్రైట్ తెలుగు సినిమాకి డైరెక్టర్ ఇతడేనా?
X

కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్, హీరో, నిర్మాత రాఘవ లారెన్స్ ( Raghava Lawrence ) ప్రస్తుతం 7 ప్రాజెక్ట్స్ ను ఏకకాలంలో లైన్ లో పెట్టడం విశేషం. తాజా సమాచారం ప్రకారం లారెన్స్ ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. చాన్నాళ్ళ తర్వాత లారెన్స్ మాస్టర్ తెలుగులో నటించనుండడం విశేషాన్ని సంతరించుకుంది.

2021లో శర్వానంద్, ప్రియాంక మోహన్‌ జోడీగా రూపొందిన శ్రీకారం మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన కిషోర్‌తో లారెన్స్ చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. హాస్య మూవీస్ బ్యానర్‌కి చెందిన కిషోర్ అండ్ నిర్మాత రాజేష్ దండా ఇటీవల చెన్నైలో లారెన్స్‌ను కలుసుకుని ఒక స్టోరీ వినిపించారట. లారెన్స్ ఆ కథకు ముగ్ధుడయ్యాడని, ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి ఆసక్తిని వ్యక్తం చేశాడని సమాచారం.

అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. అల్లరి నరేష్ త్వరలో విడుదల చేయనున్న యాక్షన్ డ్రామా, బచ్చల మల్లి, సందీప్ కిషన్, రీతూ వర్మల కామెడీ ఎంటర్‌టైనర్ మజాకాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

Tags

Next Story