Anil Ravipudi : అనిల్ రావిపూడి అదుర్స్ అంతే..

Anil Ravipudi :  అనిల్ రావిపూడి అదుర్స్ అంతే..
X

ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీ అంటే వినోదానికి తిరుగే ఉండదు. ఫస్ట్ మూవీ నుంచి మాస్ ను క్లాస్ ను మెప్పిస్తూ వస్తున్నాడు. ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 వంటి మూవీస్ తో టాప్ డైరెక్టర్ రేస్ లోకి వచ్చాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీతో సంక్రాంతి బరిలోనే జనవరి 14న రాబోతున్నారు. వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ బ్లాక్ బస్టర్ అయిపోయాయి. ముఖ్యంగా గోదారి గట్టుమీద సాంగ్ ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది. రీల్స్ తోనూ అదరగొడుతున్నారు చాలామంది. ఎలా చూసినా ఓ బ్లాక్ బస్టర్ లుక్ తో కనిపిస్తోన్న ఈ మూవీకి సంబంధించి సినిమా కంటే అనిల్ రావిపూడి ఐడియాస్ అదుర్స్ అనిపిస్తున్నాయి.

ఇవాళా రేపు ప్రమోషన్స్ ఎంత కీలకమో అందరికీ తెలుసు. ప్రాపర్ గా ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్ లో రిజిస్టర్ అవుతుంది. ఈ విషయంలో అనిల్ రావిపూడి స్ట్రాటజీ ఫన్నీగా ఉంటూనే పర్ఫెక్ట్ అనిపిస్తోంది. ఫస్ట్ సాంగ్ విషయంలో దాదాపు తెలుగు వాళ్లు మర్చిపోయిన మ్యూజీషియన్ రమణ గోగులను తీసుకు వచ్చి పాడించాడు. దానికంటే ముందు ఆయనతో పాడిస్తున్నాం అని చెబుతూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత రిలీజ్ చేసిన మీనూ పాటను సైతం అదే స్థాయిలో ప్రమోట్ చేసిన మరీ విడుదల చేశారు. అదీ సూపర్ హిట్ అయిపోయింది.

ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్.. ఈ పాట కోసం బలే ప్లాన్ చేశాడు అనిల్. ఆ పాటను తనే పాడతా అని వెంకటేష్ అతన్ని సతాయించేలా కొన్ని స్కిట్స్ లా చేశాడు. అన్నీ బాగా పేలాయి. కానీ వెంకీ పాడటం అనిల్ కు ఇష్టం లేదు అన్నట్టుగా ఇందులో కలరింగ్ ఇచ్చారు. అయినా వెంకటేష్ అదే పనిగా అడుగుతూ ఉండటంతో ఓ దశలో తను ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయనతోనే పాడించమని చెప్పేలా ఉంది. దీన్ని బట్టి వెంకటేష్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఓ సాంగ్ పాడుతున్నాడు అని తెలియడంతో పాటు.. ఆ పాటకు సంబంధించి కావాల్సినంత అటెన్షన్ వచ్చింది. ఈ నెల 30న ఆ పాటను విడుదల చేస్తారట. ఏదైనా సినిమాల కంటే ఎక్కువగా ప్రమోషన్స్ లో వినూత్నంగా వెళుతున్న అనిల్ ను చూసి మిగతా దర్శకులు కూడా నేర్చుకోవాలి అనే కామెంట్స్ వినిపిస్తుండటం విశేషం.

Tags

Next Story