BRO Twitter Review: బ్రో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్

BRO Twitter Review: బ్రో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా.. బ్రో.. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా.. బ్రో.. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ క్రేజ్ మామూలుగా ఉండదు.. రాజకీయాల్లో బిజీగా ఉన్నా సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ ని ఎంటరై టైన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఒక ప్రజలకు ఉపయోగపడే బలమైన పాయింట్ సినిమా కథలో ఉండేలా చూసుకుంటారు.. అదే ఆయనపట్ల అభిమానం పెంచుకునేలా చేసింది ఫ్యాన్స్ కి.

ఇక ఈ రోజు థియేటర్లలో సందడి చేస్తున్న బ్రో విషయానికి వస్తే ఓవర్సీస్ లో ఇప్పటికే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఇది పక్కా పవన్ ఫ్యాన్స్ కోసం నిర్మించిన సినిమా అని అంటున్నారు. పవన్ ఎంట్రీ అదిరిపోయిందని, మునుపెన్నడూ ఇలాంటి ఎంట్రీ చూడలేదని ట్వీట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ మేనరిజం, కామెడీతో ఫస్టాఫ్ బావుందని, సెకండాఫ్ కొంచెం స్లోగా నడిచిందని అంటున్నారు.. అయినా అదే మంత పెద్ద విషయంగా తీసుకోవట్లేదు.. పవన్ సినిమా మొదటి రోజే చూశామా లేదా అన్నదే పాయింట్ గా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి, హడావిడి ఎక్కువగా ఉంది. జోరున వర్షాలు కురుస్తున్నా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.

సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన బ్రోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని టీమ్ ఆశిస్తోంది. ఇక ఈ సినిమాకు స్వరాలు సమకూర్చిన తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా అందించారని మెచ్చుకుంటున్నారు. సినిమాను పవన్ తన భుజస్కందాలపై మోశారని అంటున్నారు.. సాయిథరమ్ తేజ్ నటనలో మరికొంత మెరుగుపడాల్సి ఉందని, ఎమోషనల్ సీన్స్ ఇంకా బాగా పండించవచ్చని సాయికి సలహాలు కూడా ఇస్తున్నారు.

మొత్తంగా బ్రో సినిమాలో అక్కడక్కడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా అవేవి పవన్ ఫ్యాన్స్ కి కనిపించవు.. సినిమాలో పవన్ కనిపించగానే మైనస్ లు అన్నీ మర్చిపోతారు. ఇది పీకే కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అవుతుందని పవన్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాత సినిమాల్లో గెటప్ లు, పాటలను సందర్భానుసారంగా తీసుకువచ్చి అభిమానులకు మరింత చేరువ చేశారు బ్రో సినిమాను సముద్ర ఖని.

Tags

Next Story