Tollywood: అప్పుడు కృష్ణ.. ఇప్పుడు మహేష్.. త్వరలో గౌతమ్

Tollywood: కొడుకు వల్ల కలిగే ఆనందం అతను పుట్టినప్పుడు కాక.. మంచి ప్రయోజకుడు అయినప్పుడే కలుగుతుందీ అంటాడు సుమతీ శతకకారుడు. ఇప్పుడు అలాంటి ఆనందాన్నే పొందుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణ వారసుడులా వచ్చి.. తాను కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు మహేష్‌బాబు. ఇప్పుడు తన కొడుకు గౌతమ్ నటనను చూసి మహేష్ తో పాటు ఆయన భార్య నమ్రత కూడా సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గౌతమ్ ఇంతకు ముందు ఒన్ నేనొక్కడినేలో నటించాడు. చిన్నప్పటి మహేష్ బాబు పాత్ర అది. ఆ సినిమా తర్వాత గౌతమ్ కంటిన్యూ చేస్తాడని అనుకున్నారు. కానీ ముందు చదువు, ఆ తరువాతే నటని అని అన్నారు ఇంట్లో వాళ్లు. హై స్కూల్ చదువులో ఉన్న గౌతమ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ థియేటర్ షో చేశాడు. గౌతమ్ నటనను దగ్గరుండి చూడటం చాలా ఆనందాన్ని కలిగించిందనీ.. రాబోయే రోజుల్లో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలి".. అంటూ నమ్రత ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. దీన్నిబట్టి గౌతమ్‌ని కూడా త్వరలోనే హీరోగా తెరపై చూస్తాము.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com