Mahesh Koneru: టాలీవుడ్ నిర్మాత హఠాన్మరణం..

Mahesh Koneru: టాలీవుడ్ నిర్మాత హఠాన్మరణం..
Mahesh Koneru: గతేడాది నుండి ఎంతోమంది సెలబ్రిటీలను సినీ రంగం కోల్పోయింది.

Mahesh Koneru: గతేడాది నుండి ఎంతోమంది సెలబ్రిటీలను సినీ రంగం కోల్పోయింది. ఎంతోమంది సీనియర్ యాక్టర్లు, దర్శకులు, నిర్మాతలు కన్నుమూశారు. తాజాగా మరో టాలీవుడ్ నిర్మాత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ అధినేత మహేశ్ కోనేరు ఉదయం విశాఖలో గుండెపోటుతో మరణించారు. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ లాంటి హీరోలకు మహేశ్‌ కోనేరు వ్యక్తిగత పీఆర్‌గా పనిచేశారు. 118, తిమ్మరుసు, మిస్‌ ఇండియా తదితర చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

ఆయన మరణ వార్త విన్న ఎన్‌టీఆర్ దీని గురించి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేశ్‌ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. మహేశ్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని అన్నారు ఎన్‌టీఆర్.


Tags

Next Story