Surya Devara Naga Vamsi: ఆ సినిమాలో ఏం ఉందని.. అందరూ అంతగా.. : టాలీవుడ్ నిర్మాత కామెంట్స్

Surya Devara Naga Vamsi: ఎవరి సినిమా వారికి గొప్ప.. ఒకరిది మరొకరి నచ్చాలని ఏం లేదు.. బావుంది, బాలేదు అని చెప్పే స్వేచ్ఛ, స్వతంత్రం సోషల్ మీడియా వచ్చాక మరీ ఎక్కువైంది. ఒక్కోసారి అదే కొంప ముంచుతోంది.. నచ్చని వాళ్లు వీరలెవల్లో విరుచుకుపడుతుంటారు.. ట్రోల్ చేస్తుంటారు. అయినా ఎవరేమనుకుంటే నాకేంటి.. నా మనసులో మాట చెప్పాను.. అని అదే మళ్లీ మళ్లీ చెప్తున్నారు టాలీవుడ్ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. హాలీవుడ్ మూవి అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. అందులో ఏం ఉంది అంతలా ఆదరిస్తున్నారు.. త్రీడీలో చిత్రీకరించారు కాబట్టి ఆ సినిమాను విజువల్ వండర్ అనాలా. బ్లాక్ బస్టర్ అని మెచ్చుకోవాలా అని మెచ్చుకోవాలా.. ఇంతకు ముందే అవతార్ 2 ని ఏకి పారేశారు నాగవంశీ..
తాజాగా మరోసారి మరికాస్త ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న బుట్టబొమ్మ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న వంశీ ఓ ఇంటర్వ్యూలో అవతార్ 2 గురించి మరోసారి ప్రస్తావించారు. మూడు గంటలు ఏవేవో చూపిస్తే దాన్ని విజువల్ వండర్ అనాలా.. మన దగ్గర ఉన్న త్రివిక్రమ్, రాజమౌళి లాంటి దర్శకులు సినిమాలు తీస్తే అవి బాలేవని చెప్పేవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటిది మనకు తెలియని అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సినిమా నాకు నచ్చలేదంటే ఎందుకు అంతలా బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అన్నారు. దీంతో నెటిజన్లు మరోసారి నాగవంశీపై విరుచుకుపడుతున్నారు.
కాగా, బుట్టబొమ్మ సినిమా జనవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య, వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com