SIIMA Awards 2024 : సైమా సందోహం.. రెండు రోజులు వందల తారలు
ప్రతిష్టాత్మక అవార్డ్స్ గా పరిగణించే సైమా అవార్డులు వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరిగింది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగిన ఈ వేడుకలకు అందమైన తారలు అద్భుతమైన ఆకర్షణగా నిలిచారు. ఫరియా అబ్దుల్లా, నేహాశెట్టి, శాన్వీ వంటి వారి ప్రదర్శనలు ఆహూతులను కట్టి పడేశాయి. ఈ యేడాది అవార్డుల్లో ఊహించిన సినిమాలే ఎక్కువగా సత్తా చాటాయి. ముఖ్యంగా తెలుగు, కన్నడ భాషల నుంచి.
తెలుగు నుంచి దసరా, బేబీ, హాయ్ నాన్న చిత్రాలకు అవార్డుల పంట పండింది.
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ నటుడు (విమర్శకులు): ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
సహాయ పాత్రలో ఉత్తమ నటి: బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న)
ఉత్తమ తొలి నటుడు: సంగీత శోభన్ (మ్యాడ్)
ఉత్తమ తొలి నటి: వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు ( మ్యాడ్ )
ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న, ఖుషీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సాలార్)
ఉత్తమ నేపథ్య గాయని: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
ఉత్తమ తొలి దర్శకుడు: సౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ నూతన నిర్మాత: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ( హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేష్
'సప్తసాగరదాచె ఎల్లో-ఎ'లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా రక్షిత్‌శెట్టి, నటిగా రుక్మిణీ వసంత్ అవార్డులు అందుకున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియిన్ సెల్వన్-2'లో నటనకు గానూ విక్రమ్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్ 'జైలర్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక '2018'లో చిత్రంలో నటనకుగానూ టొవినో థామస్ ఉత్తమ నటుడి (మలయాళం) అవార్డును అందుకున్నారు. ఇక మమ్ముట్టి నటించిన 'నన్పకల్ నేరతు మయక్కం' ఉత్తమ చిత్రంగా నిలిచింది.
మొత్తంగా రెండు రోజుల పాటు సాగిన సైమా వేడుకలకు నాలుగు భాషలకు చెందిన వందలమంది తారలు విచ్చేశారు. ఆ తారల తళుకులతో దుబాయ్ కళకళలాడిపోయిందనే చెప్పాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com