Singer Revanth: అన్విత మెడలో మూడుముళ్లు.. ఓ ఇంటివాడైన రేవంత్

Singer Revanth: అన్విత మెడలో మూడుముళ్లు.. ఓ ఇంటివాడైన రేవంత్
X
Singer Revanth: దాదాపు 200 పైగా పాటలు పాడిన రేవంత్ రాక్ స్టార్, స్పైసీ సింగర్ అని బిరుదులు పొందాడు.

Singer Revanth: టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రేవంత్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఫిబ్రవరి 6న గుంటూరులో కొద్ది మంది బంధువుల సమక్షంలో అన్విత మెడలో మూడు ముళ్లు వేశాడు.. గత ఏడాది డిసెంబర్ 24న నిశ్చితార్థం జరిగింది. పలువురు గాయనీ గాయకులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.





తెలుగు, కన్నడ సినిమాల్లో దాదాపు 200 పైగా పాటలు పాడిన రేవంత్ రాక్ స్టార్, స్పైసీ సింగర్ అని బిరుదులు పొందాడు. ఇండియన్ ఐడల్ సీజన్ 9 విన్నర్‌గా గెలుపొంది దేశ వ్యాప్తంగా పేరుపొందాడు. అన్నిటికంటే ముఖ్యంగా బాహుబలి చిత్రంలో ఆయన పాడిన మనోహరి పాట అత్యంత పేరు తీసుకువచ్చింది. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా అతడికి పేరు తీసుకువచ్చిన పాట ఇది.

Tags

Next Story