Allu Arjun: అల్లు అర్జున్ ఇల్లు అదిరిందిగా.. మీరు కూడా ఓ లుక్కేయండి..

Allu Arjun: అల్లు అర్జున్ ఇల్లు అదిరిందిగా.. మీరు కూడా ఓ లుక్కేయండి..
Allu Arjun: అదే ఫీలవుతున్నాడు అల్లు అర్జున్.. తాను కట్టుకున్న అందమైన ఇంటిలో అపురూపమైన తన ఫ్యామిలీని చూసుకుని.

Allu Arjun: గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు.. అప్పటికే ఇండస్ట్రీలో పేరున్న నిర్మాత నాన్న.. మామయ్య మెగాస్టార్.. తిరుగేముంది.. సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఈజీగానే వచ్చింది.. కానీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలంటే అవేవీ కాదు సమంథింగ్ స్పెషల్, కష్టపడే మనస్థత్వం.. ఆపై అదృష్టం కొంత తోడైతే స్టైలిష్ స్టార్లు, సూపర్ స్టార్లు అవుతారు..


నాన్నెంత ఇచ్చినా తాను సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకుంటే ఆ ఆనందమే వేరు.. అదే ఫీలవుతున్నాడు అల్లు అర్జున్.. తాను కట్టుకున్న అందమైన ఇంటిలో అపురూపమైన తన ఫ్యామిలీని చూసుకుని.

హైదరాబాద్‌లోని రెండు ఎకరాల స్థలంలో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అల్లు అర్జున్ ఇల్లు కట్టుకున్నాడు. విలాసవంతంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంది స్టైలిష్ స్టార్ ఇల్లు.


తన తాజా చిత్రం పుష్ప: ది రైజ్ – పార్ట్ 01 సూపర్ సక్సెస్‌తో మరింత ఉత్సాహంగా పుష్ప పార్ట్ 2 చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 354 కోట్లు వసూలు చేసి 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది.

మిలియన్ల కొద్దీ కొత్త అభిమానులను సంపాదించుకున్నాడు.. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అల్లు అర్జున్ సినిమాల్లోని స్టెప్పులు వేసి వైరల్ చేస్తుంటారు. పుష్పలోని శ్రీవల్లి పాటే అందుకు నిదర్శనం.


సింప్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉంటుందో అని అభిమానుల్లో ఆసక్తి ఉండడం సహజం. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి పేరు 'బ్లెస్సింగ్'.


గతంలో జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఇంటిలో అతడు తన తల్లిదండ్రులు, సోదరులతో కలిసి నివసించాడు. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుని అందులోకి షిప్ట్ అయ్యాడు. ఇక ఈ ఇంటి కోసం దాదాపు రూ.100 కోట్లు వెచ్చించాడని తెలుస్తోంది.


అల్లు అర్జున్ ఇంట్లో విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ ఉంది. దానిని మనవడి పుట్టినరోజున తాత అరవింద్ కానుకగా ఇచ్చాడు.


నిగనిగలాడే నలుపు రంగులో బార్ జోన్ ఉంది. ఇది పిల్లలతో ఫోటో షూట్‌లు చేసుకోవడానికి, పుట్టినరోజు వేడుక వంటి సందర్భాలకు ఉపయోగిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story