Tollywood : NTR, ANR తప్ప అందరు స్టార్ హీరోలు వాడేసిన ఏకైక టైటిల్.. !

Tollywood  : NTR, ANR తప్ప అందరు స్టార్ హీరోలు వాడేసిన ఏకైక టైటిల్.. !
Tollywood : టాలీవుడ్‌‌లో ఉన్న సెంటిమెంట్ అంతాఇంతా కాదు.. ఇండస్ట్రీ 90శాతం నడిచేది సెంటిమెంట్ పైనే అంటుంటారు సినీ విశ్లేషకులు

Tollywood : టాలీవుడ్‌‌లో ఉన్న సెంటిమెంట్ అంతాఇంతా కాదు.. ఇండస్ట్రీ 90శాతం నడిచేది సెంటిమెంట్ పైనే అంటుంటారు సినీ విశ్లేషకులు.. ఇక టైటిల్ విషయంలో అయితే సెంటిమెంట్ మరీను.. ఒక టైటిల్‌‌తో సినిమా సూపర్ హిట్ అయితే ఆ టైటిల్‌‌కి వెనుకో ముందో మరో టైటిల్‌‌ని జత చేసి సినిమాలని చేస్తుంటారు.. అలా ఓ హిట్టైన సినిమా టైటిల్‌‌ని ఎన్టీఆర్, ఏఎన్నార్ తప్ప దాదాపుగా అందరు స్టార్ హీరోలు వాడేశారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే ఖైదీ.

కాంతారావు : ఖైదీ టైటిల్‌‌తో తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఖైదీకన్నయ్య.. 1962లో వచ్చిన ఈ మూవీలో కాంతారావు హీరోగా నటించారు. ఈ సినిమాకి విఠాలాచార్య దర్శకుడు.

శోభన్ బాబు : శోభన్ బాబు మొత్తం ఖైదీ టైటిల్‌‌తో మూడు సినిమాల్లో నటించారు.. అవే ఖైదీబాబాయ్, ఖైదీకాళీదాసు, జీవితఖైదీ

చిరంజీవి : ఖైదీ టైటిల్‌‌తో మొత్తం మూడు సినిమాల్లో నటించారు చిరు.. అవే ఖైదీ, ఖైదీ 786, ఖైదీ నెంబర్ 150.

కృష్ణ : కృష్ణ ఖైదీ టైటిల్‌‌తో ఓకే ఒక్క సినిమాలో నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరు ఖైదీరుద్రయ్య..

మోహన్ బాబు : ఖైదీటైటిల్‌‌తో ఓకే ఒక్క సినిమాలో నటించారు మోహన్ బాబు. అదే ఖైదీగారు.. కృష్ణంరాజు కూడా ఇందులో నటించారు.

సుమన్ : మొత్తం ఖైదీ టైటిల్‌‌తో రెండు సినిమాల్లో నటించారు సుమన్.. అవే ఖైదీదాదా, ఖైదీ ఇన్స్పెక్టర్.

హరీష్ : హరీష్ హీరోగా ఈవివి డైరెక్షన్‌‌లో వచ్చిన ప్రేమఖైదీ సూపర్ హిట్ అయింది.


ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటుగా వారి వారుసులు అయిన బాలకృష్ణ, నాగార్జునలు కూడా ఆ టైటిల్ తో సినిమాలు చేయకపోవడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story