Venkatesh : దూసుకుపోతున్న వెంకీ మామ

Venkatesh :  దూసుకుపోతున్న వెంకీ మామ
X

విక్టరీ వెంకటేష్ సంక్రాంతిని షేక్ చేసేలా ఉన్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ పరంగా చాలా అగ్రెసివ్ గా కనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఆల్బమ్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఇక ట్రైలర్ కూడా వచ్చేస్తే మూవీ రేంజ్ పై ఒక అంచనాకు రావచ్చు. అయితే ప్రమోషన్స్ పరంగా చూస్తే వెంకటేష్, అనిల్ రావిపూడి ఎనర్జికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అనిపిస్తోంది. ప్రతి పాట రిలీజ్ ను అద్బుతమైన ప్రమోషన్స్ గా మలచుకున్నారు. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోతో మరో మెట్టు పైకి ఎక్కారు.

ఇక ప్రస్తుతం ఈ మూవీ టీమ్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా వెంకటేష్ నటించిన ఘర్షణ గెటప్ తో, ఐశ్వర్య చంటిగా, మీనాక్షి బొబ్బిలి రాజాగా, అనిల్ రావిపూడి జయం మనదేరాలోని మహదేవ నాయుడుగా కనిపిస్తూ చేసిన ఇంటర్వ్యూ ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం మా టివిలో ప్రసారం కాబోతోన్న సంక్రాంతి స్పెషల్ షోలో హీరో, హీరోయిన్లు డైరెక్టర్ సందడి చేశారు. త్వరలోనే ఆ ఎపిసోడ్ కూడా టెలీకాస్ట్ అవుతుంది. ఏదేమైనా ప్రమోషన్స్ కు ఏ మాత్రం ఆస్కారం ఉన్నా.. ఈ మూవీ టీమ్ ఆగడం లేదు. ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. అయితే కొన్నిసార్లు ఓవర్ ప్రమోషన్స్ కూడా ప్రాబ్లమ్ అవుతాయి. మామూలుగా సినిమా సర్కిల్స్ లో ‘విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయి’ అనే సామెత ఎప్పుడూ వినిపిస్తుంది. కాకపోతే వీరిని చూస్తుంటే ఈ సామెత వర్తించదు. ఖచ్చితంగా ఓ పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనేలా ఉంది. ఏదేమైనా వెంకీమామ దూకుడుకు ఇతర హీరోలు కూడా ఆశ్చర్యపోతున్నారనే చెప్పాలి.

Tags

Next Story