Raviteja and Ram Pothineni : ఇండిపెండెన్స్ డేకి టాలీవుడ్ తీన్మార్

Raviteja and  Ram Pothineni : ఇండిపెండెన్స్ డేకి టాలీవుడ్ తీన్మార్
X

ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలవుతోన్న సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఒకరిని మించి ఒకరు ప్రమోషన్స్ చేసుకుంటూ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో విన్నర్ ఎవరూ అంటే ఈ సారి ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

బాలీవుడ్ రైడ్ మూవీకి రీమేక్ గా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ కాస్త ఆలస్యంగా అనౌన్స్ చేసుకుని అదే రోజు విడుదలవుతోంది. ఈ మూవీతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన పాటలు ఓకే అనిపించుకున్నాయి. ట్రైలర్ మాత్రం మరీ అంత గొప్పగా లేదనే టాక్ వచ్చింది. అయితే హరీశ్ శంకర్ మాత్రం ఇది కంప్లీట్ గా రవితేజ మార్క్ ఎంటర్టైనర్ అంటున్నాడు. కానీ ఆ మార్క్ బోర్ కొట్టి చాలా కాలం అవుతోందనేది కూడా నిజం. అయినా ఈ మూవీతో మరోసారి వింటేజ్ రవితేజను చూస్తారంటున్నాడు దర్శకుడు.

ఇక ఎవరూ లేరు అనే ధైర్యంతో ఆగస్ట్ 15న తమ సినిమా విడుదల చేస్తున్నట్టు ముందుగా అనౌన్స్ చేశాడు పూరీ జగన్నాథ్. రామ్ తో అతను తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ ఇండిపెండెన్స్ డే రోజే విడులవుతోంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మాస్ కు ఫీస్ట్ లా ఉంటుందని చెబుతున్నాడు పూరీ. ట్రైలర్స్ రెండూ ఇస్మార్ట్ శంకర్ మీటర్ లోనే కనిపిస్తున్నాయి. అది హిట్ అయింది కాబట్టి ఇదీ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారేమో కానీ.. ఇలాంటి మూవీస్ కనెక్ట్ అయితే కచ్చితంగా హిట్ అనిపించుకుంటాయి. లేదంటే అంతే సంగతులు.

ఈ ఇద్దరితో పాటు వస్తోన్న మరో పెద్ద సినిమా తంగలాన్. తమిళ్ లోరూపొందిన ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 15నే విడుదల చేస్తున్నారు. కబాలి, కాలా ఫేమ్ పా. రంజిత్ డైరెక్ట్ చేసిన తంగలాన్ లో చియాన్ విక్రమ్, పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి వంటి వారు కీలక పాత్రలు చేశారు. వీరంతా తెలుగు వారికి తెలిసిన ఆర్టిస్టులే కావడం కొంత ప్లస్ అవుతుంది. కేజీఎఫ్ ( కోలార్ గోల్డ్ ఫీల్డ్ ) నేపథ్యంలో స్వాతంత్ర్యానికి పూర్వం కథతో ఈ మూవీ తెరకెక్కింది. ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రమోషన్స్ కూడా ఫర్వాలేదు అనే స్థాయిలోనే చేస్తున్నారు. విక్రమ్ కు సరైన హిట్ లేక ఏళ్లవుతోంది. తంగలాన్ తనకు బ్లాక్ బస్టర్ ఇస్తుందని ఎప్పట్లానే కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు విక్రమ్. మొత్తంగా ఈ మూడు సినిమాల మధ్య స్ట్రాంగ్ కాంపిటీషన్ కనిపిస్తోంది.

ఇక ఈ ముగ్గురు పెద్ద సినిమాల మధ్య వస్తోన్న మరో చిన్న తెలుగు సినిమా 'ఆయ్'. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ మూవీ గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రోళ్లు కూడా అదే నేపథ్యంలో కనిపిస్తోంది. రెండు సినిమాల మధ్య.. అలాగే చాలా గోదావరి బ్యాక్ డ్రాప్ మూవీస్ సిమిలారిటీస్ ఆయ్ లో కనిపిస్తున్నాయి. అంచేత ఈ మూవీ రిజల్ట్ అనేది కీలకంగా ఉంటుంది. సో.. తీన్మార్ దరువేస్తోన్న మూడు పెద్ద సినిమా మధ్య మేమూ ఉన్నామండీ ఆయ్ అంటోన్న ఈ కుర్రాళ్లు విజయం సాధిస్తారా లేదా అనేది చూడాలి.

Tags

Next Story