ముగ్గురు అక్కాచెల్లెళ్లతో జోడి కట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?

ముగ్గురు అక్కాచెల్లెళ్లతో జోడి కట్టిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
Tollywood: చిత్ర సీమలో వారసులుగా వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. టాలీవుడ్ లో ఐతే లిస్ట్ చాలా పెద్దదే.

చిత్ర సీమలో వారసులుగా వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. టాలీవుడ్ లో ఐతే లిస్ట్ చాలా పెద్దదే. అక్కచెల్లెళ్లు హీరోయిన్స్ గా వచ్చిన వారు తక్కువే ఉన్నారు. వారిలో ఆర్తి అగర్వాల్, కాజల్ అగర్వాల్ పక్కన పెడితే అప్పట్లే సీనియర్ హీరోయిన్ నగ్మా, జ్యోతిక, రోషిని ఉన్నారు. ఈ ముగ్గురు సొంత అక్కా చెల్లెళ్ళు కాకపోయినా కూడా హాఫ్ సిస్టర్స్ అవుతారు. వీరు తెలుగుతోపాటు తమిళ సినిమాల్లో కూడా నటించారు. నగ్మా తెలుగు ఇండస్ట్రీలో అగ్రనటీగా దూసుకెళ్లారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా టాప్ హీరోలందరితోనూ నటించారు.

నగ్మా(Nagma) తమిళంలో రజినీతో బాషా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు. జ్యోతిక(Jyothika) కూడా పలు హిట్ సినిమాల్లో చేస్తుంది. తమిళ టాప్ హీరో సూర్యతో వివాహం తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. రెండేళ్ల క్రీతం రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. వీరిద్దరి సోదరి పేరు రోషిని. రోషిని కూడా నటే. అయితే వీరు ముగ్గురు కామన్ గా నటించిన హీరో ఒకరు ఉన్నారు.

ముగ్గురు అక్కాచెల్లెళ్లతో ఆడిపాడిన టాలీవుడ్ హీరో ఒక్కరే ఉన్నారు. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో నటించి ఒక అరుదైన రికార్డు అందుకున్నారు చిరంజీవి. చిరంజీవితో నగ్మా రిక్షావోడు తో పాటు మరో రెండు సినిమాల్లో నటించారు. చిరంజీవి ప్రధాన పాత్రలో వివి వినాయక్ దర్శకత్వంలో ఠాగూర్ సినిమాలో జ్యోతిక నటించారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో జ్యోతిక కనిపిస్తుంది. రోషిని కూడా చిరంజీవితో ఆడిపాడింది. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ గా నటించారు రోషిని(Roshini).
Tags

Read MoreRead Less
Next Story