Sankranthiki Vastunnam : సంక్రాంతి విన్నర్ డిక్లేర్ అయినట్టేనా

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలూ భిన్నమైన నేపథ్యాల్లోనే కనిపించాయి. కంటెంట్ పరంగా, హీరోస్ ఇమేజ్ ల పరంగా చూసుకున్నా మూడూ డిఫరెంట్ గానే ఉన్నాయి. మొదటగా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ కు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. కాకపోతే తమ సినిమాను కావాలనే కొందరు నెగెటివ్ ప్రచారం చేశారనీ.. రిలీజ్ రోజునే ఆన్ లైన్ లో లీక్ చేశారనిఅందుకు కారణమైన 45మందిని గుర్తించి కేస్ లు పెడతామని చెప్పింది మూవీ టీమ్. అయినా గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపిస్తున్నాడు.
ఇక 12న విడుదలైన డాకూ మహరాజ్.. మూవీపై ఉన్న భారీ అంచనాలను వందశాతం అందుకోలేదు అనే చెప్పాలి. కేవలం బాలయ్య ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెగ్యులర్ యాక్షన్ డ్రామాకు చంబల్ లోయ నేపథ్యాన్ని జోడించాడు. అయినా బాలయ్య తనదైన శైలిలో అదరగొట్టడంతో బాక్సాఫీస్ వద్ద డాకూ హిట్ గా డిక్లేర్ అయింది.
ముందు నుంచీ అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టుగానే ఈ రెండు సినిమాలను దాటి రివ్యూస్ అందుకున్నారు సంక్రాంతికి వస్తున్నాం టీమ్. మూవీ టైమ్ కు సరిపోయే కంటెంట్ తో సీజన్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రూపొందించినట్టుగా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ అనిపించుకుందీ మూవీ. ఇద్దరు హీరోయిన్లు.. వెంకటేష్ టైమింగ్, అనిల్ రావిపూడి రైటింగ్, సెకండ్ హాఫ్ లో బుల్లిరాజు పాత్ర చేసిన హంగామా, కామెడీకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ చిత్రాన్నే సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేస్తున్నారు ప్రేక్షకులు. మూడు సినిమాలూ హిట్టే. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాం కాస్త ఎక్కువ హిట్టు అనేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com