RC 15 :శంకర్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!

RC 15 : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది రామ్ చరణ్‌కి 15 మూవీ కాగా, దిల్ రాజుకి 50 వ చిత్రం కావడం విశేషం.
ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకి సర్కారోడు అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌కి మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్‌ని అప్రోచ్ అయ్యారట శంకర్.
కానీ ఆ ఆఫర్‌ని మోహన్ లాల్ సున్నితంగా రిజెక్ట్ చేసారని తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన రాష్ట్ర మంత్రి పాత్ర కోసం మోహన్‌లాల్‌ని ముందుగా అనుకున్నారట. నెగిటివ్ రోల్ చేయకూడదని ఫిక్స్ అయిన మోహన్‌లాల్ ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట.. ఇప్పుడు మోహన్‌లాల్ నో అనడంతో మరో నటుడు కోసం వేటలో పడ్డారు శంకర్.
కాగా ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. చరణ్ సరసన రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది కీయరా అద్వానీ.. సునీల్, శ్రీకాంత్, అంజలి కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న RC15 పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com