Tourist Family : బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న టూరిస్ట్ ఫ్యామిలీ

Tourist Family :  బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న టూరిస్ట్ ఫ్యామిలీ
X

కంటెంట్ ఉంటే కలెక్షన్స్ ఆటో మేటిక్ గా వస్తాయనేది చాలా సినిమాలు నిరూపించాయి. కాకపోతే ప్రాపర్ ప్రమోషన్ ఉండాలి. సినిమాకు కాస్త పోస్టర్ వాల్యూ కూడా అవసరమే. తెలిసిన మొహాలు ఉంటే ఆడియన్స్ థియేటర్స్ కు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కంటెంట్ తో పాటు ఇవన్నీ కలిసి రావడంతో తమిళ్ లో ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. శశికుమార్, సిమ్రన్ జంటగా యోగిబాబు, ఎమ్ఎస్ భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అబిషాన్ జీవింత్ డైరెక్ట్ చేశాడు.

టూరిస్ట్ ఫ్యామిలీ సింపుల్ ప్లాట్ తో తెరకెక్కింది. శ్రీలంక సంభవించిన ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ కు శరణార్థిగా వచ్చిన ఓ కుటుంబం మొదట్లో సెట్ అయినా తర్వాత ఓ చిన్న సంఘర్షణతో సమస్యల్లో పడిపోతుంది. ఆ సమస్య నుంచి వాళ్లు ఎలా బయట పడ్డారు అనేదే ప్రధాన పాయింట్. ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కామెడీతో పాటు ఎమోషన్ కూడా బాగా వర్కవుట్ అయింది. దీంతో సినిమాకు అద్బుతమైన రివ్యూస్ వచ్చాయి. అందుకే కేవలం 14 రోజుల్లోనే ఏకంగా 51 కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీ బడ్జెట్ కేవలం 14 కోట్లు మాత్రమే. అంటే ఇప్పటికే మూడు రెట్లు వసూళ్లు సాధించింది. రెండో వారం పూర్తి కావొస్తున్నా.. ఇంకా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి.

శశికుమార్ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. మరికొన్ని డబ్ అయ్యాయి. ఆ మూవీస్ కు ఎప్పుడూ రానంత ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ ఈ చిత్రానికి రావడం విశేషం. సెకండ్ ఇన్నింగ్స్ లో సిమ్రన్ కు ఇది భారీ విజయంగా నిలిచిపోయింది. సో.. కంటెంట్ ఉంటే కలెక్షన్స్ వస్తాయని తమిళనాట ఈ చిన్న చిత్రం నిరూపించింది.

Tags

Next Story