Tovino Thomas: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు..

Tovino Thomas: కొంతకాలం క్రితం బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. అందులోనూ ఆ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ నౌకలో పార్టీ జరుగుతండగా.. అక్కడ డ్రగ్స్ సప్లై జరుగుతుందని సమాచారం అందిన పోలీసులు అక్కడికి చేరుకొని అందులో ఉన్న ఆర్యన్ ఖాన్‌ను, మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన ఇన్నాళ్ల తర్వాత తాజాగా ఓ మలయాళ హీరో కూడా ఈ ఘటనపై స్పందించాడు.
ఆర్యన్ ఖాన్‌పై డ్రగ్స్ కేసు నమోదయిన దగ్గర నుండి తాను ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పుకొచ్చాడు. కానీ దానిపై దర్యాప్తు పూర్తయ్యే వరకు కొన్నాళ్లు జైలుశిక్షను అనుభవించక తప్పలేదు. అయితే ఆ సమయంలో ఎంతోమంది బాలీవుడ్ నటీనటులు షారుఖ్‌కు సపోర్ట్‌గా నిలబడ్డారు. ఆర్యన్ మాటలు నమ్మాలంటూ డిమాండ్ చేశారు. కానీ దీనిపై సౌత్ సెలబ్రిటీలు పెద్దగా స్పందించలేదు. తాజాగా ఓ మలయాళ హీరో దీనిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
మలయాళంలో ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాలలో నటించి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు టోవినో థామస్. ఇటీవల తాను హీరోగా వచ్చిన 'మిన్నాళ్ మురళి' చిత్రం మూవీ లవర్స్ నుండి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా టోవినో.. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించాడు. షారుఖ్ ఖాన్ పేరును డ్యామేజ్ చేయడానికే రాజకీయంగా కుట్ర జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాలామంది ప్రజలు కూడా ఇది నిజమని నమ్మరు అన్నాడు టోవినో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com