Toxic teaser : టాక్సిక్ టీజర్.. కేజీఎఫ్ ను మించిపోయేలా ఉందే

హీరోయిన్లందరితో ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేయడం టాక్సిక్ మూవీకి సంబంధించి బెస్ట్ థింగ్ అనుకున్నారు. ఇవాళ యశ్ బర్త్ డే స్పెషల్ గా ఆ హీరోయిన్లు కూడా అస్సలు కనిపించకుండా టీజర్ మాత్రమే విడుదల చేశారు. టీజర్ కు మాత్రం అద్భుతం అనే టాక్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండటం బిగ్గెస్ట్ ఎసెట్ లా ఉంది. ఇలాంటి టీజర్ ను ఇండియాలో అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. గీతా మోహన్ దాస్ డైరెక్ట్ చేసిందీ మూవీని. అందుకే టీజర్ ను స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటారు చాలామంది.
వేరే దేశంలో స్మశానం ఉంటుంది. ఆ స్మశానాన్ని కొందరు విలన్స్ అంతా ఆక్రమించారు. చుట్టూ గేట్స్ మూసేస్తారు. విలన్స్ అంతా పెద్ద పెద్ద గన్స్ పట్టుకుని కాపలా ఉంటారు. అలాంటి వారి ముందుకు ఓ కార్ వచ్చి ఓ చెట్టును ఢీ కొడుతుంది. తర్వాత వాళ్లంతా మూగేస్తారు. బట్ ఆ కార్ లో ఒక పెద్దాయన చేసిన చిన్న పని ఉంటుంది. దాంతో పాటు యశ్ కార్ లోనే సెక్స్ చేస్తున్నట్టు కనిపించారు. అసలు ఇది ఏ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయని సీన్. తర్వాత యశ్ కార్ లో నుంచి దిగాడు. పెద్దాయన చేసిన పనిలో భాగంగా అందరినీ కాల్చేస్తాడు. ఆ కాల్పులతోనే దద్దరిల్లిపోతుంది. చివర్లో పూర్తి స్థాయిలో యశ్ ను చూపిస్తారు. అతను వారిని ఉద్దేశిస్తూ డాడీస్ హోమ్ అనే డైలాగ్ చెబుతాడు. ఇదీ టీజర్. ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది.
యశ్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 19న ఈ మూవీ విడుదల కాబోతోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. గీతా మోహన్ దాస్ డైరెక్షన్ లో కేవీఎన్ ప్రొడక్షన్స్ తో పాటు మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

