Toxic : టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 .. రన్ టైమ్ అంతా..?

టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 మూవీస్ మధ్య గట్టి పోటీ ఉంది. ధురంధర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది. అందుకే సెకండ్ పార్ట్ ను ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. కేజీఎఫ్2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న యశ్ టాక్సిక్ మూవీతో వస్తున్నాడు. ఈ రెండూ మార్చి 19నే విడుదల కాబోతున్నాయి. రెండు సినిమాల మధ్య పోటీ మాత్రం చాలా గట్టిగానే ఉంది. ఒకరికి మించి ఒకరు కనిపిస్తున్నారు. ఓ దశలో టాక్సిక్ ను వాయిదా వేయాలనే టాక్ వచ్చింది. ఈ విషయంపై యశ్ అండ్ టీమ్ స్ట్రాంగ్ గా అదే టైమ్ కు వస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇక ఈ రెండు సినిమాల రన్ టైమ్ చూస్తే మాత్రం చాలా పెద్ద సినిమాలుగా వస్తున్నట్టు కనిపిస్తోంది. టాక్సిక్ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది. గీతూ లాంటి లేడీ డైరెక్టర్ ఇలాంటి మూవీ చేయడం చాలా ఆశ్చర్యమనిపించింది. ఆ స్థాయిలో ఉంది టీజర్. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ లాంటి ఫీమేల్ లీడ్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ చూస్తే 3 గంటల 25 నిమిషాలుగా తేల్చారు. అంటే చాలా పెద్ద సినిమాగానే చూడాలి. 3 గంటల 25 నిమిషాలు అంటే సినిమా బావుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మరీ బోరింగ్ మూవీ గా తేలుస్తారు.
ఇక ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ లో రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. ఇది ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ గతేడాది డిసెంబర్ 5నే విడుదల చేశారు. ఇప్పటికీ ఓటిటిల్లో అదరగొడుతోంది. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక మూవీ రన్ టైమ్ మాత్రం టాక్సిక్ కంటే కూడా ఎక్కువే. ధురంధర్ 2కి రన్ టైమ్ ఏకంగా 3 గంటల 40నిమిషాలు. ఓ రకంగా ఇంగ్లీష్ లో అయితే ఇది రెండు సినిమాల స్థాయిలో ఉంటుంది. మరి ఇంత పెద్ద నిడివితో మూవీ అంటే ఈ మధ్య కాలంలో నమ్మలేనంతగా ఉంది. మరి ఈ మూవీ కూడా బావుంటే ఆడియన్స్ చూస్తారు. లేదంటే దారుణమైన పరాజయం గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది. మొత్తంగా ఈ రెండు సినిమాలు భారీ నిడివితో గట్టి పోటీ మధ్య విడుదల కాబోతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
