Aswin Babu : శివం భజే ట్రైలర్.. టైటిల్ కు తగ్గట్టుగా తాండవమాడేలా ..

కొన్ని ట్రైలర్స్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. కొన్ని ట్రైలర్ జస్టిఫికేషన్ లా అనిపిస్తాయి. ఈ రెండు ఫీలింగ్స్ ను ఇచ్చిన ట్రైలర్ గా ఈ మధ్య వచ్చిన శివం భజే కనిపిస్తోంది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి, దైవభక్తి కలిపిన కథలా కనిపిస్తోంది. మన దేశానికి ఎదురైన ఓ ప్రమాదం నంచి ఓ ఏజెంట్ ఎలా కాపాడాడు.. అనే పాయింట్ తో కనిపిస్తోంది. దీంతో పాటు ట్రైలర్ మధ్యలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు అనే కోణంలోనూ ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను తలపించే ఎపిసోడ్స్ ఉంటాయోమో అనుకునే లోపే.. ఏకంగా హీరోపైనా అటాక్ జరుగుతుంది. ఆ తర్వాత అసలు ఆట ఆ శివుడే మొదలుపెట్టాడు అన్నట్టుగా మొత్తం కలరింగ్ మారిపోతుంది.
అసలు మన దేశానికి ప్రమాదం తలపెట్టింది ఎవరు..? వారి టార్గెట్ ఏంటీ..? ఆ ప్రమాదం నుంచి హీరో ఎలా కాపాడాడు.. ఈ క్రమంలో అతనికి శివుడు ఎలా సాయం చేశాడు అనే ఆసక్తికరమైన పాయింట్స్ చాలానే ఉన్నాయి. రీసెంట్ గా హిడింబ మూవీతో మాస్ అండ్ యాక్షన్ హీరోగా కొత్త అవతారంలో కనిపించాడు అశ్విన్. దాన్ని కంటిన్యూ చేేసేలా కనిపిస్తోంది. మొత్తంగా శివంభజే టైటిల్ కు తగ్గట్టుగా థియేటర్స్ లో ప్రేక్షకులతో తాండవం చేయించాలా ఉందీ మూవీ.
అప్సర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఆర్టిస్టుల పరంగా చూస్తే.. అశ్విన్ బాబు తో పాటు దిగాంగన సూర్యవంశీ, మురళీ శర్మ, హైపర్ ఆది, బ్రహ్మాజీ వంటి వాళ్లు కనిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com