Tribanadhari Barbarik : తెలుగు సినిమా.. ప్రమోషనల్ మిస్టేక్స్

Tribanadhari Barbarik :  తెలుగు సినిమా.. ప్రమోషనల్ మిస్టేక్స్
X

ఒకసారి క్లిక్ అయిందంటే అది ప్రతిసారీ క్లిక్ అవుతుందని కాదు. కొందరికి కొన్నిసార్లు అలా కలిసొస్తుంది. లేదా వాళ్లు కరెక్ట్ గా జడ్జ్ చేయగలిగారు అని అర్థం. కొన్నాళ్ల క్రితం కోర్ట్ మూవీకి సంబంధించి ఆ చిత్ర నిర్మాత అయిన నాని.. ఈ కోర్ట్ మీకు నచ్చకపోతే తన హిట్ 3 మూవీకి రావాల్సిన అవసరం లేదు అని వేదికపైనే చెప్పాడు. చాలామంది ఆశ్చర్యపోయారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఒకవేళ పోతే అనే ప్రశ్నలు వేశారు. బట్ నాని నమ్మకం నిజం అయింది. కోర్ట్ హిట్ అయింది. హిట్ 3 కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నాని రూట్ లో చాలామంది వేదికలపై స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సినిమాలు మాగ్జిమం పోతున్నాయి.

ఆ మధ్య సోహైల్ అనే చిన్న ఆర్టిస్ట్ తనకు బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీని నిజమే అని భ్రమించి హీరోగా నటిస్తూ సినిమా నిర్మించాడు. కట్ చేస్తే ఆ సినిమా డిజాస్టర్. దీంతో ప్రెస్ మీట్స్ లో అతను చూపిన అత్యుత్సాహంతో పాటు సినిమా పోయింది కాబట్టి ఆడియన్స్ ను నిందిస్తూ చేసిన కామెంట్స్ అన్నీ ఆ తర్వాత ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాయి.

రీసెంట్ గా పరదా అనే మూవీ విషయంలో ఇదే జరిగింది. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోటీ పడి మరీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తమ సినిమా రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ వేస్తున్నామని.. ఆ రివ్యూస్ చూసే మీరు సినిమాకు రండి అని సవాల్ విసిరారు. కట్ చేస్తే రివ్యూస్ అన్నీ బిలో యావరేజ్ మూవీ అని తేల్చాయి. దీంతో సినిమా భారీగా లాస్ అయింది. వాళ్లు అలా ఛాలెంజ్ చేయకపోతే కనీసం ఆడియన్స్ ఫ్రీ మైండ్ సెట్ తో అయినా థియేటర్స్ కు వచ్చేవాళ్లు. అప్పుడు వాళ్ల సొంత ఒపీనియన్ నే చెప్పేవాళ్లు. చాలాసార్లు రివ్యూస్ మైండ్ సెట్ ను ప్రభావితం చేస్తాయి అనేందుకు ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి.

తాజాగా త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా దర్శకుడు సైతం అదే మిస్టేక్ చేశాడు. తన సినిమా బాలేదు అంటే చెప్పుతో కొట్టుకుంటా అని వీరావేశంగా ప్రకటించాడు. ఇతని పేరు మోహన్ శ్రీవత్స. సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సాంచి రాయ్, విటీవి గణేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. కథ పరంగా బానే అనిపించినా.. కథనంతో విపరీతంగా కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు. అదే పనిగా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటూ అనేక లేయర్స్ తో స్క్రీన్ ప్లే కనిపించడంతో చిరాకు పెట్టించాడు. పైగా ఊహించగలిగే కథనం కూడా. అందుకే ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీనికి తోడు ఇవి నవరాత్రి రోజులు కదా. జనం థియేటర్స్ వైపే చూడటం లేదు. ఫలితంగా తను ఓ థియేటర్ కు వెళితే అక్కడ కనీసం పది మంది కూడా లేరని.. ఉన్నవాళ్లను సినిమా ఎలా ఉందీ అని అడిగితే బావుందున్నారనీ.. అయినా ఆడియన్స్ థియేటర్స్ కు ఎందుకు రావడం లేదు అని ఆవేశపడిపోతూ ఆవేదన చెందుతూ.. లైవ్ లో తన చెప్పుతో తనే కొట్టుకున్నాడు.

సో.. మనం తీసినవన్నీ మనకు కళాఖండాలుగానే కనిపిస్తాయి. ప్రేక్షకుల వరకూ వస్తే కానీ అసలు నిజం తెలియదు. ఒక్కోసారి సీజన్ ప్రాబ్లమ్ వల్లో ఇంకేవైనా కారణాలతోనే మంచి కటెంట్స్ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుంటాయి. అలాంటివి వదిలేస్తే.. సినిమాపై అతి ప్రేమతో చేసే కొన్ని కామెంట్స్ వల్ల తర్వాత ట్రోల్ మెటీరియల్ అవడం తప్ప మరే లాభం ఉండదు.

Tags

Next Story