Trisha Political Entry : త్రిష నిజంగా రాజకీయాల్లోకి రానుందా..?

Trisha Political Entry : త్రిష త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది త్రిష. ఎన్నో హిట్ సినిమాల్లో టాప్ హీరోల సరసన నటించింది. త్రిష ఇప్పుడేమి చేస్తుంది అనుకునే టైంకి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఇదొక గుడ్ న్యూజ్ అని చెప్పుకోవచ్చు. తలపతి విజయ్ సూచన మేరకు త్రిష్ రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ ఆమె ప్రత్యక్షంగా పోటీ చేసే సూచనలు కనబడుతున్నాయి.
కుష్బు, స్మృతి ఇరానీ, జయసుధ, నవనీత్ కౌర్, నగ్మా, విజయశాంతి, ఇలా ఎందరో నటీమణులు సినీ కెరీర్ తరువాత అసెంబ్లీలో పార్లమెంటులో అడుగుపెట్టారు. టాలీవుడ్‌లో త్రిష చివరి సినిమా 'నాయకి'. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1లో నటించింది. సెప్టెంబర్ 30న ఈ మూవీ పలు భాషల్లో రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com