Trisha : ఈ యేడాది అంతా త్రిషదే హవా

నాలుగు పదుల వయసులోనూ వన్నె తరగని సౌందర్యంతో ఆకట్టుకున్న బ్యూటీ త్రిష. రెండున్నర దశాబ్దాల క్రితమే కెరీర్ మొదలుపెట్టిన త్రిష కొన్నాళ్ల పాటు తెలుగు, తమిళ్ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత తనింక సినిమాలు చేయదేమో అనుకున్నారు. కానీ నయనతారలాగా ఈ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతోంది. వరుసగా టాప్ హీరోల సరసన ఆఫర్స్ కొట్టేస్తూ అదరగొడుతోంది.
ఈ 2025 త్రిషకు మోస్ట్ స్పెషల్ ఇయర్ గా మారబోతోంది. ఎందుకంటే తను నటించిన సినిమాలు 5 విడుదలవుతున్నాయి ఈ యేడాది. వీటిలో నాలుగు తమిళ్, ఒక తెలుగు సినిమ ఉండటం విశేషం. ఆల్రెడీ లాస్ట్ మంత్ అజిత్ కుమార్ సరసన నటించిన విడాముయర్చి( తెలుగులో పట్టుదల) విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనిపించుకున్నా త్రిష సోయగానికి ఎప్పట్లానే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఇక ఈ సమ్మర్ లో ఏప్రిల్ 10న మరోసారి అజిత్ కుమార్ సరసనే నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. పట్టుదల పోయినా.. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి అజిత్ ఫ్యాన్స్ లో. జూన్ 5న కమల్ హాసన్ సరసన నటించిన థగ్ లైఫ్ విడుదల కాబోతోంది. 35యేళ్ల తర్వా కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. కమల్ విక్రమ్ మూవీ రికార్డులను బద్ధలు కొడుతుందంటున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందబోతోన్న సినిమాలో త్రిష హీరోయిన్. ఈ చిత్రం కూడా ఈ యేడాది చివర్లో వచ్చే అవకాశాలు 100 శాతం ఉన్నాయి.
వీటితో పాటు తెలుగులో మెగాస్టార్ సరసన నటించిన విశ్వంభర కూడా ఉంది. ఈ మూవీని సమ్మర్ లో విడుదల చేస్తారు అనుకున్నారు. కానీ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో.. మొత్తం 5 సినిమాలు. అన్నీ టాప్ హీరోలతో నటించినవే. సో.. మరో రెండు మూడేళ్ల వరకూ త్రిష కెరీర్ కు ఎలాంటి ఢోకా ఉండదు అనుకోవచ్చు. ఏదేమైనా ఈ యేజ్ లో ఒక హీరోయిన్ ఇంత టాప్ స్పీడ్ లో వెళ్లడం అంటే చిన్న విషయం కాదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com