అమ్మ పాత్రలో త్రిష.. ఆ హీరోకి తల్లిగా..

మెగాస్టార్ చిరంజీవికి జోడీగా త్రిష ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. మరో సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకు తల్లిగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించడానికి అంగీకరించింది.
హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన తమిళ కామెడీ “బ్రో డాడీ”ని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒరిజినల్‌లో, మోహన్ లాల్, మీనా పృథ్వీరాజ్ తల్లిదండ్రులుగా కనిపించగా, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయిక. తెలుగు వెర్షన్‌లో చిరంజీవి మరియు త్రిష సీనియర్ లీడ్‌లను పోషిస్తారని, DJ టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల జూనియర్ లీడ్‌లను పోషించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది.
పొన్నియన్ సెల్వన్‌లో త్రిష లీడ్ రోల్ పోషించింది. 28-30 ఏళ్ల వయసున్న సిద్ధు జొన్నలగడ్డకు తల్లిగా 40 ఏళ్ల వయస్సులో ఉన్న త్రిష నటించడానికి అంగీకరించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకవేళ ఆమె అందుకు అంగీకరించినట్లయితే, ఆమెకు చెల్లిస్తున్న రెమ్యునరేషన్ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com