Trisha : హాట్ టాపిక్ గా మారిన ఎలక్షన్ రిజల్ట్స్ ముందు త్రిష పూజలు

త్రిష సడెన్ గా హాట్ టాపిక్ గా మారింది. అందుకు తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ ఆమె పూజలు చేయడంతో పాటు తిరుమల దర్శనం చేసుకోవడం మాత్రమే కాదు.. విజయ్ విజయం సాధించబోతున్నాడు అనేది మాత్రం బిగ్గెస్ట్ టాపిక్ గా మారింది. నిజంగా చూస్తే ఇవాళ త్రిష బర్త్ డే. తన బర్త్ డే రోజున తన ప్రియుడి విజయాన్ని కూడా కాంక్షిస్తూ తను చేసిన పూజలన్నీ ఫలించబోతున్నాయి అనేలా ఉంది సిట్యుయేషన్. త్రిష ఇవాళ తన 43వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. అదే సమయంలో విజయ్ విజయం కూడా ఖాయంగా కనిపించడం విశేషంగా ఉంది. ఈ కారణంగానే ప్రస్తుతం విజయ్ తో పాటు త్రిష కూడా చాలా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియా మొత్తం త్రిష గురించి తెగ మాట్లాడుతున్నారు. వెదుకుతున్నారు కూడా.
త్రిషతో విజయ్ ఎఫైర్ అంటూ చాలాకాలంగా వినిపిస్తోన్న వార్త. ఆ కారణంగానే విజయ్ సొంత భార్య సంగీతకు విడాకులు కూడా ఇవ్వబోతున్నాడు. మామూలుగా అయితే సంగీత విడాకుల కేస్ గత 23నే హియరింగ్ వచ్చింది. కానీ ఎన్నికల ఫలితాల కారణంగా కాస్త ఈ కేస్ ను వాయిదా వేయాలని విజయ్ లాయర్స్ కోరిక పరిగణలోకి తీసుకున్న చెన్నై కోర్ట్ ఈ కేస్ ను జూన్ నెలకు వాయిదా వేసింది. ఓ వైపు విజయ్ ఈ కేస్ ను కోర్ట్ బయటే పరిష్కరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఏదేమైనా ఇవాళ టివికే పార్టీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే భద్రతాధికారులు విజయ్ ఇంటికి చేరుకున్నారు. భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. చాలామంది అధికారులు విజయ్ ఇంటి వైపు వెళుతున్న విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంగా త్రిష బర్త్ డే రోజున విజయ్ ఎన్నికల్లో గెలవడం మాత్రం చాలా విశేషంగా ఉంది. మరి ఎన్నికల తర్వాత త్రిష, విజయ్ ఎఫైర్ బలమైన బంధంగా మారబోతుందా అనేది తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
