Bheemla Nayak Pre Release Event: మాటల మాంత్రికుడు ఒక్క మాట కూడా మాట్లాడక పోవడానికి కారణం..

Bheemla Nayak Pre Release Event: ఎంత పెద్ద సభ అయినా మాటల మాంత్రికుడు మైక్ పట్టుకున్నాడంటే పిన్ డ్రాప్ సైలెంట్.. ఒక్కో మాట ఆణిముత్యమే అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు వినడానికే వచ్చే వాళ్లు కొందరుంటారు.. ఆయన స్పీచ్ ఆధ్యంతం వినాలనిపిస్తుంది.
భీమ్లానాయక్‌ని భుజాల మీద వేసుకున్నా ప్రీ రిలీజ్ వేదిక మీద అంత సైలెంట్‌గా ఎందుకున్నారు.. ఎందుకు ఏం మాట్లాడలేదు.. యూనిట్ వద్దన్నారా.. ఆయనే ఊరుకున్నారా.. కారణమేదైనా త్రివిక్రమ్ అభిమానులకు అది నిరాశే.. అవడానికి ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరక్టరే అయినా త్రివిక్రమ్ పేరే బాగా వినిపించింది.
దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే త్రివిక్రమ్ మాట్లాడలేదంటున్నారు. భీమ్లానాయక్ క్రెడిట్ అంతా సాగర్ చంద్రకే ఇచ్చేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓ వీడియో త్రివిక్రమ్‌ని బాగా డిస్ట్రబ్ చేసిందని, అందుకే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారని మరో వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా అభిమానులను త్రివిక్రమ్ నిరాశపరిచినందుకు పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి దీనిపై త్రివిక్రమ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com