Sonali Bendre : త్రివిక్రమ్ గారూ..ఈ మాజీ హీరోయిన్ పై ఓ లుక్కేయండి..

Sonali Bendre :   త్రివిక్రమ్ గారూ..ఈ మాజీ హీరోయిన్ పై ఓ లుక్కేయండి..
X

సోనాలి బెంద్రే.. ఈ తరానికి పెద్దగా తెలియదు కానీ.. ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ మూవీస్ తో అదరగొట్టింది. తనకంటూ ఇక్కడ టాప్ స్టార్డమ్ రాలేదు కానీ.. కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. పెళ్లి సందడి, ఇంద్ర, మురారి, ఖడ్గం, మన్మథుడు, శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆఫర్స్ చాలానే ఉన్నా.. బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేయడంతో టాలీవుడ్ లో నెంబర్ వన్ అనిపించుకోలేకపోయింది. గ్లామర్, నటనతోనూ ఆకట్టుకున్న సోనాలి బెంద్రే కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో మళ్లీ హాట్ టాపిక్ అయింది. అందుకు కారణం రీ రిలీజ్ లు అని వేరే చెప్పక్కర్లేదు.

రీసెంట్ గా తను మహేష్ బాబుతో నటించిన మురారి రీ రిలీజ్ అయి సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ గురువారం ఇంద్ర మళ్లీ విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన వీడియో బైట్స్ సోనాలి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. త్వరలోనే శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ ను కూడా రీ రిలీజ్ చేస్తారు అనే టాక్ ఉంది. మొత్తంగా ఈ రీ రిలీజ్ ల పుణ్యమా అని తను తెలుగు ప్రేక్షకులకు మళ్లీ కనిపిస్తోంది. అదే టైమ్ లో మేకర్స్ కూడా తనతో రీ ఎంట్రీ ఇప్పిస్తే ఖచ్చితంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించే సత్తా ఉంది.

కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సోనాలి బెంద్రే వయసు ఇప్పుడు 49యేళ్లు. ఇంతకంటే చిన్న వయసులోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, అత్త పాత్రలతోనూ అమ్మ పాత్రలోనూ మెప్పించిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఆ కెపాసిటీ సోనాలికి కూడా ఉంది. అందుకే ఈ రీ రిలీజ్ వల్ల తను మళ్లీ మేకర్స్ దృష్టిలో పడుతుంది కాబట్టి మరోసారి తనను తెలుగు తెరపై చూడొచ్చు. అన్నట్టు మన్మథుడు టైమ్ లో త్రివిక్రమ్ దర్శకుడు కాలేదు. ఆయన డైరెక్టర్ అయిన తర్వాత ఇలాంటి మాజీ హీరోయిన్లందరినీ తాజాగా పరిచయం చేస్తున్నాడు.. అలా సోనాలిని కూడా తను మళ్లీ పరిచయం చేస్తే ఇంకా బావుంటుందేమో. పైగా ఇలాంటి మాజీ హీరోయిన్లు త్రివిక్రమ్ తో రీ లాంచ్ అయ్యి చాలా చాలా బిజీ అయిపోయారు కూడానూ.

Tags

Next Story